Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
తెలంగాణ

హైదరాబాద్‌లో 47 మంది మావోయిస్టుల భారీ లొంగుబాటు

హైదరాబాద్తె : తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేత మరియు లొంగుబాటు ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. శుక్రవారం హైదరాబాద్లోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో 47 మంది మావోయిస్టులు సామూహికంగా లొంగిపోయారు.
ఈ పరిణామం దేశవ్యాప్తంగా మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. లొంగిపోయిన మావోయిస్టులు తమ వెంట తెచ్చుకున్న 34 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. వీటిలో ఏకే-47, ఎస్ఎల్ఆర్ వంటి అత్యాధునిక తుపాకులు ఉన్నట్లు సమాచారం. లొంగిపోయిన వారిలో అత్యధికులు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వారేనని, వారు ఉద్యమాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నారని పోలీసులు వెల్లడించారు.

గత కొన్ని నెలలుగా తెలంగాణ పోలీసులు చేపట్టిన వ్యూహాత్మక చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. డిసెంబర్ 2025: 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. తిప్పిరి తిరుపతి (దేవ్ జీ), మల్లారాజి రెడ్డి (సంగ్రామ్), బడే చొక్కారావు (దామోదర్), నూనె నరసింహా రెడ్డి (గంగన్న) వంటి అగ్రనేతలు పోలీసుల ముందు లొంగిపోయారు. ఏప్రిల్ రెండో వారంలో మరో 30 మంది మావోయిస్టులు ప్రధాన స్రవంతిలోకి వచ్చారు.

కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ ప్రభావంతో మావోయిస్టు కేడర్ కుప్పకూలుతోంది. 2026 మార్చి 31 నాటికి దేశాన్ని మావోయిస్టు రహితంగా మార్చాలని కేంద్ర హోం శాఖ నిర్దేశించిన లక్ష్యం మేరకు భద్రతా బలగాలు ముమ్మరంగా పనిచేస్తున్నాయి.నిరంతర కూంబింగ్, ఛత్తీస్గఢ్ అబూజ్మడ్ అడవుల్లో బలగాల పహారా పెరగడం.అగ్రనేతల లొంగుబాటు, పార్టీ సిద్ధాంతాల పట్ల నమ్మకం సడలడం, అనారోగ్య సమస్యలు.ప్రభుత్వం కల్పిస్తున్న నగదు ప్రోత్సాహకాలు, భూమి మరియు ఉపాధి అవకాశాల పట్ల ఆకర్షితులవ్వడం తదితర కారణాలతో మావోయిస్టులు లొంగుబాటు బాట పుడుతున్నారు.

ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. “హింస ద్వారా ఏదీ సాధించలేమని మావోయిస్టులు గుర్తించాలి. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరపున పూర్తిస్థాయిలో పునరావాసం కల్పిస్తాం. ఇంకా అడవుల్లో ఉన్నవారు తక్షణమే ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలి” అని పిలుపునిచ్చారు. ఈ భారీ లొంగుబాటుతో తెలంగాణలో మావోయిస్టుల ఉనికి దాదాపుగా నామమాత్రంగా మారింది. ఛత్తీస్గఢ్ నుండి వచ్చి హైదరాబాద్లో లొంగిపోవడం అనేది తెలంగాణ పోలీసుల వ్యూహరచనకు నిదర్శనంగా నిలుస్తోంది.

Related posts

హయత్ నగర్లో కారు దగ్దం

రాజాసింగ్ కు సీరియస్ గా నోటీసులు

M HANUMATH PRASAD

150 కోట్లు స్వాహా చేసిన సెక్యూరిటీ సంస్థ

M HANUMATH PRASAD

హయత్ నగర్ సీఐపై హైడ్రా కమిషనర్ సీరియస్

M HANUMATH PRASAD

తెలంగాణలో టెన్షన్‌.. బీజేపీ ఎంపీ ఈటల ఇంటి వద్ద ఉద్రిక్తత

M HANUMATH PRASAD

నేను పాకిస్తాన్ కి బావని.. ట్రోలింగ్స్ పై అసదుద్దీన్ ఓవైసీ సెటైర్లు..!

M HANUMATH PRASAD