Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
తెలంగాణ

కవిత డూప్లికేట్ పార్టీ: సెటైర్లతో చిత్తు చేసిన బీఆర్ఎస్!

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ కల్వకుంట్ల కవిత ప్రకటించిన కొత్త పార్టీ ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS)పై సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ (BRS) సంధించిన సెటైరికల్ బాణాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
కవిత పార్టీ పేరును ప్రకటించిన కొద్దిసేపటికే బీఆర్ఎస్ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ ప్రత్యక్షమైంది. “ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే!” అనే క్యాప్షన్‌తో కోల్గేట్, బిస్లరీ వంటి బ్రాండెడ్ ఉత్పత్తులు.. వాటిని పోలి ఉండే నకిలీ ఫోటోలను షేర్ చేసింది. తెలంగాణలో టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) అన్న పేరుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్‌ను వాడుకునేందుకు కవిత ప్రయత్నిస్తున్నారనే అర్థం వచ్చేలా ఈ సెటైర్ వేశారు. రాష్ట్రం కోసం పోరాడిన అసలైన తెలంగాణ పార్టీ తమదేనని, ఈ కొత్త పార్టీ కేవలం అనుకరణ మాత్రమేనని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా ఎద్దేవా చేసింది.
మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో కవిత తన రాజకీయ నూతన ప్రస్థానాన్ని ప్రారంభించారు. వేలాదిగా తరలివచ్చిన మహిళా కార్యకర్తల మధ్య ‘తెలంగాణ రాష్ట్ర సేన’ జెండాను ఆమె ఆవిష్కరించారు. గతంలో బీఆర్ఎస్‌గా మారిన టీఆర్ఎస్ పేరును పోలి ఉండేలా తన పార్టీ పేరును ‘TRS’ అని ప్రకటించడం వెనుక పాత కేడర్‌ను ఆకట్టుకునే వ్యూహం ఉందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా మహిళా సాధికారత, తెలంగాణ ఆత్మగౌరవం నినాదాలతో కవిత ఈ కొత్త అస్త్రాన్ని బయటకు తీశారు.

Related posts

గచ్చిబౌలిలో బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ..రోడ్డున పడ్డ 200 మంది ఉద్యోగులు

M HANUMATH PRASAD

అగ్నిప్రమాదంలో మృతులు వీరే

M HANUMATH PRASAD

పైసలిస్తేనే ఫైళ్ల పై మంత్రుల సంతకాలు…కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

M HANUMATH PRASAD

చెరువు భూమిని క్రమబద్ధీకరించే అధికారం ప్రభుత్వానికి లేదు. * తెలంగాణ హైకోర్టు

M HANUMATH PRASAD

బీహార్‌లోనూ రేవంత్‌ చిచ్చు

M HANUMATH PRASAD

కవిత పార్టీపై ఎంపీ ధర్మపురి అర్వింద్ సెటైర్లు

M HANUMATH PRASAD