Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు చేయి ఎముక ఫ్యాక్చర్ అయింది. ప్రజాప్రతినిధుల కు ఆట విడుపుగా నిర్వహిస్తున్న క్రీడల నేపథ్యంలో క్రికెట్ ఆడిన ఆయన..
పొరపాటున కింద పడడంతో చేయికి బలమైన గాయం అయింది. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించగా.. చేయి ఎముక విరిగినట్టు వైద్యులు గుర్తించారు. అనంతరం చేతికి కట్టువేశారు. ప్రస్తుతం రఘురామ రెస్టు తీసుకుంటున్నారు.

ఇదిలావుంటే, రఘురామ చేతికి గాయం కావడంపై.. ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న సునీ ల్ కుమార్ స్పందించారు. సోషల్ మీడియా ఫేస్‌బుక్ వేదికగా.. ఆయన స్పందిస్తూ.. ఎద్దేవా చేశారు. చిన్న గాయానికి రెండు చోట్ల ఎముకలు విరిగాయని పేర్కొంటూ.. సదరు ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. “జస్ట్ అలా పడిపోతేనే.. రెండు చోట్ల ఎముకలు విరిగాయి.” అని పేర్కొన్నారు.

దీనికి కొనసాగింపుగా.. కాలి పాదానికి సంబంధించి స్కానింగ్‌ను కూడా పోస్టు చేసిన సునీల్ కుమార్‌.. “ఆనాడు కస్టడీలో నిజంగానేఎవరైనా కొట్టి ఉంటే.. ఎన్ని ఫ్యాక్చర్లు ఉండాలి?. ఇక, ఆయన(రఘురామ) వర్ణించినంత దారుణంగా కొడితే..?” అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. “అబద్ధాలు బయట పడుతున్నా యి. నిజాలు దాగవు”అని ఐపీఎస్ సునీల్ కుమార్‌ పేర్కొన్నారు.

ఎందుకిలా?

వైసీపీ హయాంలో రఘురామ ఎంపీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే.. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధా నాలపై ఆయన గళం వినిపించారు. ఈ క్రమంలోనే ఆయనపై కేసులు నమోదై.. 2022లో ఆయన పుట్టిన రోజు నాడు ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం కస్టడీలో తనను కొట్టారని రఘురామ ఆరోపించారు. దీనిపై ప్రస్తుతం కేసులు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ.. సునీల్ కుమార్‌ పోస్టు చేయడం గమనార్హం.

Related posts

కూటమి నేతల్లారా రోజులు లెక్కపెట్టుకోండి.. ప్రజలు కోలుకోలేని దెబ్బ కొడతారు’

M HANUMATH PRASAD

మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు నమోదు

M HANUMATH PRASAD

రైలు నుంచి జారి పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

M HANUMATH PRASAD

గోబ్యాక్ జగన్ – తెనాలిలో ఎస్సి ల ధర్నా

M HANUMATH PRASAD

తిరుపతిలో రైలు పైకి ఎక్కిన విద్యార్థి…విద్యుత్ తీగలు తగిలి షాక్‌తో మృతి

M HANUMATH PRASAD

స్వచ్ఛభారత్ కు 10 సంవత్సరాలు

GIT NEWS