Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్

పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే మృతి

ఉమ్మడి విశాఖపట్నం జిల్లా, ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో ఉన్న పాయకరావుపేట ఎస్సీ రిజర్వుడు నియోజవర్గం మాజీ శాసన సభ్యురాలు గంటెల సుమన (63) మృతి చెందారు.

శుక్రవారం తెల్లవారుజామున వారు కన్నుమూశారని కుటుంబ సభ్యులు ప్రకటించారు. ప్రస్తుతం సుమన అక్కయ్యపాలెంలో నివసిస్తున్నారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నారు.

చికిత్స పొందుతున్న క్రమంలో గంటెల సుమన తుదిశ్వాసను విడించారు. తన రాజకీయ ప్రస్థానంలో తొలుత తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఆమె విజయం సాధించారు. తరువాతి కాలంలో కాంగ్రస్ పార్టీలో చేరారు. 1983లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.

1989, 1994, 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమిని ఎదుర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే సుమన పార్థివ దేహాన్ని అక్కయ్యపాలెంలోని ప్రియదర్శిని ఓల్డ్ ఏజ్ హోమ్ లో ప్రజల సందర్శనార్థం ఉంచటం జరిగిందని, నేడు సాయంత్రం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న ప్రముఖులు ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. సుమన మృతి పట్ల సంతాపాన్ని తెలిపారు.

Related posts

మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు నమోదు

M HANUMATH PRASAD

తెలుగు చిత్ర పరిశ్రమకు చాలా రోజుల తరువాత మంచి హిట్ మూవీ -నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి

M HANUMATH PRASAD

నేపాల్‌లో ఉద్రిక్తతలు.. ఏపీకి చెందిన యాత్రికుల బస్సుపై దాడులు

M HANUMATH PRASAD

బెంగళూరు ఎయిర్ పోర్ట్ పై చంద్రబాబు ప్రశంసలు

M HANUMATH PRASAD

ఏపీలో కొత్త రైల్వే లైన్‌.. ఈ రూట్‌లోనే, హైదరాబాద్ నుంచి తిరుపతి త్వరగా వెళ్లొచ్చు.. లైన్ క్లియర్

M HANUMATH PRASAD

తిరుపతిలో రైలు పైకి ఎక్కిన విద్యార్థి…విద్యుత్ తీగలు తగిలి షాక్‌తో మృతి

M HANUMATH PRASAD