Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
సినిమా వార్తలు

పవన్‌ క్షమాపణ చెప్పకపోతే.. ఒక్క సినిమా కూడా ఆడదు.. కోమటిరెడ్డి వార్నింగ్..

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన కోనసీమ దిష్టి వ్యాఖ్యలపై పొలిటికల్‌ దుమారమే రేగుతోంది..పవన్‌ కల్యాణ్‌ కామెంట్లపై ఘాటుగా స్పందిస్తున్నారు తెలంగాణ నేతలు.. పవన్‌ క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ ఒక్క సినిమా కూడా ఆడదంటూ వార్నింగ్‌ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. పవన్‌ కల్యాణ్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.ఇక, పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలు నన్ను బాధించాయి.. భేషరతుగా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్‌ చేశారు మంత్రి కోమటిరెడ్డి.. తెలంగాణ ప్రజల దిష్టి కాదు.. ఆంధ్రా పాలకుల వల్ల.. తెలంగాణ ప్రజలు ఫ్లోరైడ్ విషం తాగారని ఆవేదన వ్యక్తం చేశారు.. పవన్ కల్యాణ్‌ క్షమాపణ చెప్పకపోతే.. ఒక్క సినిమా కూడా ఆడదు అని వార్నింగ్‌ ఇచ్చారు.. సినిమా ఆటోగ్రాఫి మంత్రిగా చెబుతున్నా.. క్షమాపణ చెప్పక పోతే.. ఒక్క థియేటర్ లో కూడా సినిమా విడుదల కాదు మీది అని హెచ్చరించారు.. అయితే, చిరంజీవి సూపర్ స్టార్.. ఆయన మంచోడు.. కానీ, పవన్ కల్యాణ్‌కు రాజకీయ అనుభవం లేదు అనుకుంటా.. అందుకే అలా మాట్లాడుతున్నారు అని వ్యాఖ్యానించారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

Related posts

సినీ పరిశ్రమ ఐసీయూలో ఉంది.. ఎగ్జిబిటర్ల వివాదంపై స్పందించిన నిర్మాత ఎస్‌కేఎన్‌

M HANUMATH PRASAD

అలీ లం* కొడుకు ఎక్కడున్నాడు.. బూతులు తిట్టిన రాజేంద్ర ప్రసాద్..

M HANUMATH PRASAD

కమల్ హాసన్ అహంకారానికి ఇది నిదర్శనం, విమర్శలతో విరుచుకుపడిన విజయేంద్ర యడియూరప్ప

M HANUMATH PRASAD

స్టేజిపై ఏడ్చేసిన మంచు మనోజ్.. కట్టుబట్టలతో రోడ్డుపై పెట్టేశారు.. కార్లు లాగేసుకున్నారు

M HANUMATH PRASAD

ఎట్టకేలకి తమ లవ్ సీక్రెట్ బయటపెట్టిన సుహాసిని.. ఆ సినిమా చూసి మణి గొంతు కోశా

M HANUMATH PRASAD

నెలకు రూ.40 లక్షల భరణం ఇవ్వు.. జయం రవి భార్య పిటిషన్..