రెండు కీలక బిల్లులను తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించారు. మొత్తం నాలుగు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తే అందులో రెండు బిల్లులను ఆమోదించారు.
అదేవిధంగా ఇప్పటి వరకు 50 శాతం రిజర్వేషన్ల క్యాప్‌ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గెజిట్ నోటిఫికేషన్ (Gazette Notification) విడుదలకు కూడా గవర్నర్ అనుమతిని ఇచ్చిన నేపథ్యంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుంది.
కాగా, రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లు, పురపాలికలు, నగరపాలక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేసి… బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచేందుకు ఉద్దేశించిన పంచాయతీరాజ్, పురపాలక చట్టాల సవరణ బిల్లులు రెండింటిని సెప్టెంబర్ 2న రాజ్ భవన్ (Raj Bhavan)కు పంపిన విషయం తెలిసిందే. ఆగస్టు 31న అసెంబ్లీ (Assembly)లో, సెప్టెంబర్ 1న శాసన మండలిలో ఆ రెండు బిల్లులు ఆమోదం పొందాయి. ఈ క్రమంలోనే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తన వద్దకు వచ్చిన రెండు బిల్లులపై లీగల్ ఒపీనియర్ (Legal Opinion) తీసుకుని రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేత బిల్లు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు ఆమోదం తెలిపారు. ఇవాళ లేదా రేపు గెజిట్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ వెలువడనుంది.
