వినాయకుడి ఊరేగింపులో అపశృతి చోటుచేసుకుంది. గుండెపోటుతో ఓ కానిస్టేబుల్ మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. ఘట్‌కేసర్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కె.డేవిడ్(31) అనే కానిస్టేబుల్ మల్కాజిగిరిలో నివాసం ఉంటున్నారు.
ఆదివారం తెల్లవారుజామున వినాయకుడి ఊరేగింపులో పాల్గొన్న ఆయన.. నృత్యం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు ఆయనను వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తలిరంచారు. పరిస్థితి విషమించడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మల్కాజిగిరి పోలీసులు తెలిపారు.
