Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలు

హంతకుడు అప్పలరాజుకు ఉరిశిక్ష విధించిన విశాఖ కోర్టు

 

ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని నరికి చంపిన అప్పలరాజు అనే హంతకుడికి విశాఖ న్యాయస్థానం మరణశిక్ష విధించింది. 2021 ఏప్రిల్‌ 15న విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో ఇద్దరు పిల్లలు సహా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని అప్పలరాజు హత్యచేశాడు.

జుత్తాడలోని బత్తిన, బొమ్మిడి కుటుంబాల మధ్య వివాదాలున్నాయి.

ఈ క్రమంలో బొమ్మిడి కుటుంబం ఇంట్లోకి చొరబడిన అప్పలరాజు ఆరుగురిపై కత్తితో దాడి చేశాడు. దొరికిన వారిని దొరికినట్టు నరికిచంపేశాడు. హంతకుడి దాడిలో బొమ్మిడి రమణ (63), ఉషారాణి (35), అల్లూరి రమాదేవి (53), నక్కెళ్ల అరుణ (37), బొమ్మిడి ఉదయ్‌ (2), ఉర్విష (6 నెలలు) ఘటనా స్థలిలోనే మృతి చెందారు.

ఘటన తర్వాత నిందితుడు స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కోర్టుకు సాక్ష్యాధారాలు సమర్పించడంతో నిందితుడికి మరణ శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది.

 

Related posts

పోలీసులకు చురకలు.. టాయిలెట్లలో నేరస్తులే పడుతున్నారా? హైకోర్టు ప్రశ్న

M HANUMATH PRASAD

కమల్ హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా?

M HANUMATH PRASAD

SC quashes AP High Court order, Grants relief to MP Mithun Reddy*

M HANUMATH PRASAD

తుని లయన్స్ క్లబ్ నూతన కార్య వర్గ ప్రమాణ స్వీకారం

M HANUMATH PRASAD

దళితుల పట్ల కొనసాగుతున్న వివక్ష

M HANUMATH PRASAD

వైసీపీకి ఎదురు దెబ్బ.. బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌ జకియా ఖానం

M HANUMATH PRASAD