Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
తెలంగాణ

జెంటిల్ మాన్ కు ప్రతిరూపం దత్తాత్రేయ గారు -ఏపీ సీఎం చంద్రబాబు

హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయది పేరుకు హిందుత్వం… మతం భారతీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.

అలయ్‌ బలయ్‌ అంటే జ్ఞాపకం వచ్చేది దత్తాత్రేయ అని అభివర్ణించారుదత్తాత్రేయ కోరుకున్నది జనహితం… ఆయనది లౌకికవాదమని కొనియాడారు. లేఖలు రాయడంలో దత్తాత్రేయ అంబాసిడర్‌గా నిలిచారని సీఎం ప్రశంసించారు.

హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఇవాళ (ఆదివారం) జరిగింది. ‘ప్రజల కథే నా ఆత్మకథ’ పేరుతో దత్తాత్రేయ పుస్తకం రచించారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్క్ష్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కిషన్‌రెడ్డి, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, ఏపీ గవర్నర్‌ నజీర్‌, ఏపీ మంత్రి సత్యకుమార్‌, పలు రాష్ట్రాల గవర్నర్లు, పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు.

.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ,జెంటిల్‌మెన్‌కు ప్రతిరూపం దత్తాత్రేయ అని అన్నారు. దత్తాత్రేయను దత్తన్న అని అభిమానంగా పిలుచుకుంటారన్నారు. సాధారణ కార్యకర్త నుంచి జాతీయ నేతగా ఎదిగారని కొనియాడారు. ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, సంఘర్షణలు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. “దత్తాత్రేయ కోరుకుంది జనహితం.. ఆయనది లౌకిక వాదం. ఆయన పాటించేది మత సామరస్యం. ‘అలయ్‌ బలయ్‌’ పేరుతో అన్ని వర్గాలను ఏకతాటిపైకి తెచ్చారు. అందరినీ కలిపేందుకు వేదిక రూపొందించారు. ఆయనకు విరోధులు ఎవరూ ఉండరు. ఆయనకు ఏ రాజకీయ పార్టీ అనే వ్యత్యాసం ఉండదు. దత్తాత్రేయది ఆదర్శ రాజకీయ జీవితం. ప్రజాసమస్యలపై ప్రభుత్వాలు, సీఎంలకు లేఖలు రాశారు. లేఖలు రాయడంలో అంబాసిడర్‌గా నిలిచారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం అనునిత్యం పనిచేశారు. ఉత్తర, దక్షిణ భారత్‌ ప్రజలతో ఆయన మమేకమయ్యారు” అని చంద్రబాబు తెలిపారు

రాజకీయాల్లో నీతి, నిజాయితీ… సిద్ధాంతాలు ముఖ్యం: వెంకయ్య

బండారు దత్తాత్రేయ ఆటో బయోగ్రఫీ పుస్తకావిష్కరణలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొని మాట్లాడారు. ‘ప్రజల కథే నా ఆత్మకథ’ పేరుతో బండారు దత్తాత్రేయ ఆటో బయోగ్రఫీ రచించారని తెలిపారు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ… సిద్ధాంతాలు ముఖ్యమని ఉద్ఘాటించారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని సూచించారు. రాజకీయ విమర్శలు సంస్కారవంతంగా ఉండాలని చెప్పారు. అసభ్యంగా మాట్లాడే వారికి ఎన్నికల్లో సరైన జవాబివ్వాలని వెంకయ్యనాయుడు తెలిపారు.

Related posts

హైదరాబాద్ లో బాణసంచా కాల్చడంపై నిషేధం – సీపీ సివి ఆనంద్

M HANUMATH PRASAD

పోస్కో, అత్యాచార కేసులలో మహిళల భద్రతకే పెద్ద పీట

సిద్దిపేట లో పోలీస్ రైడ్-అల్ఫ్రజోలం సీజ్

రేపటి నుంచి స్లాట్ బుకింగ్

M HANUMATH PRASAD

హైదరాబాద్​ నగరం నడిబొడ్డున ఆక్రమణల కూల్చివేత

M HANUMATH PRASAD

పైసలిస్తేనే ఫైళ్ల పై మంత్రుల సంతకాలు…కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

M HANUMATH PRASAD