Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
తెలంగాణ

కవిత ఆస్తులపై విచారణ!

బ్యూటీ పార్లర్ నడుపుకునే కవితకు వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో విచారణ చేయించాలని నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అంటున్నారు. గాంధీభవన్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఆయన కవితపై సంచలన ఆరోపణలుచేశారు.

జాగృతి లో 800 కోట్ల అవినీతి జరిగిందని.. జాగృతి మీద విచారణ జరగాల్సి ఉందన్నారు. జాగృతి పేరు మీద పెద్దఎత్తున వసూళ్లు చేశారని.. అవినీతి సొమ్మును జాగ్రత్త చేసుకోవడానికి కవిత జాగృతి బలోపేతం అంటుందని విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చనిపోయిన రైతులకు ఆర్థిక సహాయం చేస్తానని చేయలేదని గుర్తు చేశారు. బంజారాహిల్స్ లో 2వేల కోట్ల ఆస్తులు ఉన్నవి,విల్లాలు ఎక్కడివని ప్రశ్నించారు. బ్యూటీ పార్లర్ నడిపే కవితకు వేల కోట్లు ఎక్కడివి…స్కిల్ ట్రైనింగ్ కోసం కేంద్ర ప్రభుత్వం జాగృతికి ఫండ్స్ ఇస్తే కవిత కాజేసిందని అన్నారు. అయ్యప్ప సొసైటీ లో ఆంధ్రోళ్ల దగ్గర డబ్బులు వసూలు చేసిందన్నారు.

కవిత లెటర్ వెనుక బీజేపీ..ఉందని బీజేపీ వ్యూహ రచనలో భాగమే కవిత లెటర్ అని మధుయాష్కీ విశ్లేషించారు. బీఆర్ఎస్ వీక్ అయితే బీజేపీ స్ట్రాంగ్ అవుతదని మోదీ స్ట్రాటజీ అని.. కవిత ను కాంగ్రెస్ లో చేర్చుకొనే అంత ఖర్మ పట్టలేదని మధుయాష్కీ చెబుతున్నారు. బీజేపీ తో కలిసి కాంగ్రెస్ ను ముంచాలని కవిత చూస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ పార్టీ ఆపిసులో కనీసం జెండా ఎగవేయలేదని మండిడ్డారు.

కల్వకుంట్ల కుటుంబం ఆస్తులపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచారణ చేపట్టి తెలంగాణ ను దోచుకున్న రాబందుల పార్టీని వాళ్లకు వంత పాడిన అధికారుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేటిఆర్ కు అమెరికా, దుబాయ్ లో పెట్టుబడులు ఉన్నాయని.. ఇన్వెస్ట్ మెంట్స్ చూసుకోవడానికి కేటీఆర్ అమెరికా వెళ్లాడని అంటున్నారు. మధుయాష్కీ డిమాండ్ చేసినట్లుగా కవిత ఆస్తులు, జాగృతి వసూళ్ల మీద విచారణ జరిపితే రాజకీయం జోరుగా మారుతుంది.

Related posts

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నాగార్జున దంపతులు.. అఖిల్ పెళ్లికి ఆహ్వానం..!

M HANUMATH PRASAD

రాజాసింగ్ కు సీరియస్ గా నోటీసులు

M HANUMATH PRASAD

KCR ఫ్యామిలీలో అసలేం జరుగుతోంది.. కవిత కోపానికి కారణాలివేనా.!!

M HANUMATH PRASAD

చంచల్ గూడ జైలులో ‘A’ క్లాస్ సౌకర్యాలు కల్పించండి – గాలి జనార్ధన రెడ్డి

M HANUMATH PRASAD

గాలికి బెయిల్ మంజూరు

M HANUMATH PRASAD

హైదరాబాద్ లో బాణసంచా కాల్చడంపై నిషేధం – సీపీ సివి ఆనంద్

M HANUMATH PRASAD