Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
తెలంగాణ

పోలీస్ సేవ పతకాలు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం*

తెలంగాణ ప్రభుత్వం పోలీస్ సేవ పథకాలను ప్రకటించింది, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ సేవ పథకాలను ప్రకటిస్తూ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా, ఉత్తర్వులు జారీ చేసారు..
మొత్తం పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో పనిచేసిన మొత్తం 625 మందికి పథకాలు లభించాయి. అందులో గ్రేహౌండ్స్‌కు చెందిన 9 మందికి శౌర్య పతకం దక్కింది. 16 మంది మహోన్నత సేవా పతకం, 92 మంది ఉత్తమ సేవా పతకానికి అర్హులయ్యారు. అలాగే 47 మందికి కఠిన సేవా పతకం, 461 మంది సేవా పతకానికి ఎంపిక అయ్యారు..
అదేవిధంగా అవినీతి నిరోధక శాఖలో ఒకరికి మహోన్నత సేవా, నలుగురికి ఉన్నత సేవా, 17 మందికి సేవా పతకాలు లభించాయి. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖలో ఒకరికి ఉత్తమ సేవా, ఐదుగురికి సేవా పతకాలు వరించాయి..
స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లో ఒకరికి మహోన్నత సేవా, ముగ్గురికి ఉత్తమ సేవా, 15 మందికి సేవా పతకాలను వచ్చాయి. డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీస్‌ శాఖలో ఇద్దరికి శౌర్య పతకం, ఒకరికి మహోన్నత పతకం, ముగ్గురికి ఉత్తమ సేవా, 14 మందికి సేవా పతకాలు లభించాయి..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రతి ఏడాది అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీసు అధికారులకు సేవా పతకాలు ప్రధానం చేస్తున్న విషయం పాఠకులకు తెలిసిందే..

Related posts

హయత్ నగర్ సీఐపై హైడ్రా కమిషనర్ సీరియస్

M HANUMATH PRASAD

గాలికి బెయిల్ మంజూరు

M HANUMATH PRASAD

కారు పార్కింగ్‌ గొడవ.. హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దారుణ హత్య!

M HANUMATH PRASAD

సొంత పార్టీ వాళ్లే ఓడించారు.. భారాస ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

M HANUMATH PRASAD

హైదరాబాద్‌లో పాక్ ఉగ్రవాదులు? వీడియో వైరల్

M HANUMATH PRASAD

మల్లారెడ్డి వర్సెస్ అధికారులు.. మళ్లీ హైటెన్షన్

M HANUMATH PRASAD