Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
తెలంగాణ

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నాగార్జున దంపతులు.. అఖిల్ పెళ్లికి ఆహ్వానం..!

అక్కినేని ఇంట మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సినీ నటుడు అక్కినేని నాగార్జున దంపతులు కలిశారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో శనివారం రేవంత్ రెడ్డిని కలిసి తమ కుమారుడు అఖిల్ వివాహ వేడుకకు రావాల్సిందిగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా సీఎంతో నాగార్జున దంపతులు కాసేపు ముచ్చటించారు.

గతేడాది నవంబర్‌లో అక్కినేని అఖిల్‌కు జైనబ్ రవ్జీ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. నిశ్చితార్థం తర్వాత ఈ ప్రేమ పక్షులు పలుమార్లు మీడియా కంట పడ్డారు. ఇటీవల విదేశాలకు వెళ్లి జైనాబ్ బర్త్ డే సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు

అఖిల్ – జైనాబ్ ల పెళ్లి జూన్ 6న జరగబోతుందని సమాచారం. వీరి పెళ్లి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టేడియోలోనే సింపుల్‌గా జరగనున్నట్లు తెలుస్తోంది. నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే జరిగింది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. అఖిల్ ‘సిసింద్రీ’ చిత్రంతోనే బాలనటుడిగా వెండితెరపై కనిపించాడు. ఆ తరువాత 2015లో ‘అఖిల్’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’, ‘మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచిలర్‌’, ‘ఏజెంట్‌’ వంటి చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం ‘లెనిన్’ మూవీలో నటిస్తున్నాడు. కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది.

Related posts

పోస్కో, అత్యాచార కేసులలో మహిళల భద్రతకే పెద్ద పీట

హిందూ ఓట్ల ఏకీకరణ, విపక్షాల వైఫల్యమే బీజేపీ గెలుపుకు కారణం..

M HANUMATH PRASAD

గచ్చిబౌలిలో బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ..రోడ్డున పడ్డ 200 మంది ఉద్యోగులు

M HANUMATH PRASAD

కారు పార్కింగ్‌ గొడవ.. హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దారుణ హత్య!

M HANUMATH PRASAD

టీ. వి. యాంకర్ ఆత్మ హత్య – అనుమానాలు?

M HANUMATH PRASAD

భూభారతి చట్టం కింద పట్టాలిస్తామంటున్న సర్కారు

M HANUMATH PRASAD