Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
అంతర్జాతీయం

మరో నగరాన్ని స్వాధీనం చేసుకున్న బిఎల్ ఎ

బలూచిస్థాన్ – పాకిస్థాన్‌కి బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) చుక్కలు చూపిస్తోంది. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని కీలకమైన సురబ్ నగరాన్ని తమ సాయుధ యోధులు పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్లు బీఎల్ఏ ప్రకటించింది.

బీఎల్ఏ ప్రతినిధి జియాంద్ బలోచ్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, సురబ్ నగరంలోని స్థానిక లెవీస్ స్టేషన్, పోలీస్ స్టేషన్, ఒక బ్యాంకు ఇప్పుడు తమ ఆధీనంలో ఉన్నాయని తెలిపారు. పెద్ద సంఖ్యలో బీఎల్ఏ యోధులు సురబ్ నగరంలోని కీలక ప్రాంతాలను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. అంతేకాకుండా, క్వెట్టా-కరాచీ, సురబ్-ఘిదర్ ప్రధాన రహదారులపై విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

ఈ పరిణామాల నేపథ్యంలో, అదనపు డిప్యూటీ కమిషనర్ (ఏడీసీ) హిదాయత్ ఉల్లా ఊపిరాడక మరణించినట్లు తెలిసింది. సాయుధ దుండగులు ఆయన్ను ఒక గదిలో బంధించడం వల్లే ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు. సురబ్ ప్రాంతంలో ప్రస్తుతం భయానక వాతావరణం నెలకొందని, బయటి ప్రపంచంతో సంబంధాలు దాదాపుగా తెగిపోయాయని స్థానిక వర్గాలు అంటున్నాయి. అయితే, ఈ ఘటనపై పాకిస్థాన్ ప్రభుత్వం లేదా భద్రతా సంస్థల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అవకాశం దొరికినప్పుడల్లా పాక్ సైనిక బలగాలపై విరుచుకుపడుతూ, నగరాలను స్వాధీనం చేసుకుంటూ బీఎల్ఏ ముందుకు సాగుతుండటం గమనార్హం.

Related posts

పాక్ ప్రధాని నా విలువైన మిత్రుడు :టర్కీ అధ్యక్షుడు

M HANUMATH PRASAD

పాకిస్తాన్ క్రికెట్ బోర్డును దేవుడే ఆదుకోవాలి

M HANUMATH PRASAD

కిరానా హిల్స్‌లో అమెరికా అణుస్థావరం!

M HANUMATH PRASAD

అమెరికాని అడ్డుకోవడానికి ఏకమైన ఏడు దేశాలు.. గ్రీన్‌లాండ్‌కి తోడుగా

M HANUMATH PRASAD

‘నన్ను చంపి.. ఇక్కడే పాతిపెట్టండి’.. షేక్‌ హసీనా సంచలన వ్యాఖ్యలు!

M HANUMATH PRASAD

పాక్ పై బెహ్రెయిన్ లో చెలరేగిన ఒవైసీ.. ఈ హెచ్చరిక పీక్స్!

M HANUMATH PRASAD