Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
అంతర్జాతీయం

బాల్య వివాహ నిషేధ చట్టం తెచ్చిన పాక్‌

పాకిస్తాన్‌ బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని తీసుకువచ్చింది. అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీ శుక్రవారం ఇందుకు సంబంధించిన బిల్లుపై సంతకం చేశారు.

పాకిస్తాన్‌లో ఇకపై 18 ఏళ్ల లోపు బాలబాలికలకు వివాహం చేయడం చట్ట విరుద్ధం. ‘ఇస్లామాబాద్‌ కేపిటల్‌ టెర్రిటరీ చైల్డ్‌ మ్యారేజీ రిస్ట్రెయింట్‌ బిల్లు’ను పార్లమెంట్‌లోని ఉభయసభలు ఈ నెల 27వ తేదీన ఆమోదించాయి. బిల్లుపై అధ్యక్షుడు జర్దారీ సంతకం చేసిన విషయాన్ని పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ(పీపీపీ)సెనేటర్‌ షెర్రీ రెహ్మాన్‌ ‘ఎక్స్‌’లో ప్రకటించారు.

‘బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ముఖ్యమైన చట్టాన్ని రూపొందించడంలో పాకిస్తాన్‌ ఒక మైలురాయిని అధిగమించింది’అని ఆమె పేర్కొన్నారు. అయితే, మత సంస్థలతోపాటు ఇస్లామిక్‌ చట్టాలకు భాష్యం చెప్పే కౌన్సిల్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ ఐడియాలజీ(సీఐఐ)సైతం ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 18 ఏళ్లలోపు వివాహాన్ని అత్యాచారంగా పరిగణించడం ఇస్లామిక్‌ చట్టాలకు వ్యతిరేకమని సీఐఐ వాదిస్తోంది. సమాజంలో అరాచకాన్ని నిరోధించాలంటే అధ్యక్షుడు జర్దారీ ఈ బిల్లుపై సంతకం చేయరాదని సీఐఐ సభ్యుడు మౌలానా జలాలుద్దీన్‌ అంతకుముందు వ్యాఖ్యానించారు.

Related posts

హిందూ వ్యక్తి హత్యపై స్పందించిన మహ్మద్ యూనస్ ప్రభుత్వం..

M HANUMATH PRASAD

దేశాల్లో షాకులతో ట్రంప్ బిగ్ యూటర్న్..! ఇరాన్ పై తాజా ప్లాన్ ..!

M HANUMATH PRASAD

సుప్రీంకోర్టు తీర్పుపై అసహనం వ్యక్తం చేసిన ట్రంప్

M HANUMATH PRASAD

యుద్ధం ఓడిపోయినట్లు ఒప్పుకోకపోతే ఇరాన్‌కి చుక్కలు చూపిస్తాం: వైట్‌హౌస్ హెచ్చరిక

M HANUMATH PRASAD

హమాస్ చీఫ్ ను మట్టుబెట్టిన ఇజ్రాయెల్: మిస్సైళ్ల వర్షం

M HANUMATH PRASAD

పాకిస్తాన్ కాల్పులలో విధులు నిర్వహిస్తూ మురళీనాయక్ మృతి-