Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
అంతర్జాతీయం

4 నుంచి హజ్‌ యాత్ర.. ప్రకటించిన సౌదీ అరేబియా

ముస్లింల పవిత్ర స్థలం మక్కాలో ప్రతి ఏటా జరిగే హజ్‌ యాత్ర జూన్‌ 4న ప్రారంభమవుతుందని సౌదీ అరేబియా ప్రకటించింది. ఇస్లామిక్‌ చంద్రమాన క్యాలెండర్‌లోని చివరి నెలలో నెలవంక దర్శనం ఆధారంగా హజ్‌ యాత్ర తేదీలను సౌదీ అరేబియా సుప్రీంకోర్టు ప్రకటిస్తుంది.

ప్రతి ఏటా ఈ తేదీలు మారుతుంటాయి.

ఈ ఏడాది జూన్‌ 4 నుంచి నాలుగు రోజులపాటు హజ్‌ యాత్ర కొనసాగుతుంది. ఇందులో రెండో రోజు అంటే జూన్‌ 5న అరాఫత్‌ మైదానంలో జరిగే సామూహిక ప్రార్థనల్లో హజ్‌ యాత్రికులు అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు. మహమద్‌ ప్రవక్త చివరి ఉపన్యాసం ఇచ్చిన రోజుగా దీనిని పరిగణిస్తారు. జూన్‌ 6న ఈద్‌-అల్‌-అధాను జరుపుకుంటారు. ఈసారి హజ్‌ యాత్రలో దాదాపు పది లక్షల మంది ముస్లింలు పాల్గొంటారని అంచనా.

Related posts

కాల్పులు ఉండవు, తప్పులు జరగవు- డీజీఎంఓ స్థాయి చర్చల్లో పాకిస్థాన్‌ అంగీకారం

M HANUMATH PRASAD

ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరుల అరెస్ట్‌

M HANUMATH PRASAD

భారత్‌కు పాకిస్తాన్‌ లేఖ

M HANUMATH PRASAD

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొన్న పాక్‌ ఆర్మీ ఉన్నతాధికారులు వీళ్లే.. పేర్లు రిలీజ్‌ చేసిన భారత్‌

M HANUMATH PRASAD

నాకు సరైన క్రెడిట్ ఇవ్వలేదు..” కాల్పుల విరమణపై మరోసారి స్పందించిన ట్రంప్

M HANUMATH PRASAD

పాక్ మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్ దారుణ హత్య..?- ఎంత వరకు నిజం?

M HANUMATH PRASAD