Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్

సజ్జల భార్గవరెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గతంలో సోషల్ మీడియా విభాగ కన్వీనర్‌గా వ్యవహరించిన సజ్జల భార్గవరెడ్డి వ్యవహారంలో సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది

సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.

సోషల్ మీడియా దుర్వినియోగంపై న్యాయవ్యవస్థ హెచ్చరిక:

సజ్జల భార్గవరెడ్డి పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు మాదిరిగా గట్టిగా పలుకుబడి కలిగిన రాజకీయ నాయకులు, పార్టీ ప్రతినిధులు సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యలపై ఎంత బాధ్యతతో ఉండాలో చెబుతున్నాయి. ఢిల్లీలో ఈ కేసుకు సంబంధించిన విచారణ సందర్భంగా, సజ్జల భార్గవరెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే, ఆయన అరెస్టు కాకుండా రెండు వారాల పాటు మధ్యంతర ఉపశమనం కల్పించింది. ఈ రెండు వారాల వ్యవధిలోగా సంబంధిత ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది.

న్యాయస్థాన ధోరణి

ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం సజ్జల భార్గవరెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన పెట్టిన సోషల్ మీడియా పోస్టుల విషయంలో తీవ్ర అభ్యంతరాలను నమోదు చేసింది. మీరు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు మాకు అర్థం కాలేదని భావిస్తున్నారా? ఏ ఉద్దేశంతో ఆ పోస్టులు పెట్టారో మేము గ్రహించలేమని అనుకుంటున్నారా? ఆ పోస్టులు సహించరాని విధంగా ఉన్నాయి అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది.

సోషల్ మీడియా బాధ్యత – విధిగా మారాలి

తప్పు ఎవరు చేసినా అది తప్పేనని, అలాంటి చర్యలను వ్యవస్థ ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమించదని, తప్పకుండా శిక్షిస్తుందని స్పష్టం చేసింది. ‘సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే కేసుల్లో అంత తేలిగ్గా బెయిల్ లభిస్తుందని ఆశించవద్దు. ఒకవేళ అలా బెయిల్ వస్తే ప్రతి ఒక్కరూ తమ ఇష్టానుసారం ప్రవర్తిస్తారు’ అని సుప్రీంకోర్టు తీవ్ర స్వరంతో హెచ్చరించినట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా వినియోగంపై బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి.

 

Related posts

జర్నలిజం ముసుగులో జగన్ పై అబ్బద్దాల దాడి- వైసీపీ నేత కారుమూరి వెంకట రెడ్డి

M HANUMATH PRASAD

త్వరలో అమరావతి ‘మూడో దశ’.. ఏంటిది?

M HANUMATH PRASAD

యజమాని మర్మాంగాలు కొరికి తిన్న పెంపుడు కుక్క – కలకలం సృష్టించిన హైదరాబాదులో ఘటన

మళ్లీ వైసీపీ రాదు. రానివ్వను.. పిచ్చి వేషాలేస్తే తొక్కినారా తీస్తా: పవన్ కళ్యాణ్

M HANUMATH PRASAD

ఏపీలో మరో కొత్త రైల్వే లైన్ రాబోతుంది. త్వరలోనే టెండర్లు!

M HANUMATH PRASAD

విశాఖలో పిడుగుపడి భారీ పేలుడు

M HANUMATH PRASAD