Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
క్రీడా వార్తలు

వెస్టిండీస్, బంగ్లాదేశ్‌లకు ఘోర అవమానం.. క్రికెట్‌లో ఒకే రోజు రెండు మిరాకిల్స్

క్రికెట్ చిన్న జట్లు టాప్ జట్లను ఓడించడం అరుదుగా చూస్తూ ఉంటాం. కానీ ఒకే రోజు అంతర్జాతీయ క్రికెట్ లో రెండు మిరాకిల్స్ జరిగాయి. యూఏఈ, ఐర్లాండ్ లాంటి పసికూన సంచలన విజయాలను నమోదు చేసుకున్నాయి.

బుధవారం (మే 21) మొదట ఐర్లాండ్, వెస్టిండీస్ మధ్య తొలి వన్డే జరిగింది. ఈ మ్యాచ్ లో ఐర్లాండ్ జట్టు వెస్టిండీస్ ను ఓడించడమే కాదు భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం విశేషం. డబ్లిన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐర్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 303 పరుగుల భారీ స్కోర్ చేసింది.

బాల్బిర్నీ (112) సెంచరీతో అదరగొట్టడంతో పాటు స్టిర్లింగ్ (54), హ్యారీ టెక్టర్ (56) హాఫ్ సెంచరీలు చేసి రాణించారు. ఆ తర్వాత ఛేజింగ్ లో బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ కేవలం 179 పరులకే ఆలౌట్ అయింది. దీంతో ఐర్లాండ్ 124 పరుగుల తేడాతో తమ దేశ చరిత్రలోనే గొప్ప విజయాన్ని అందుకుంది. ఒకదశలో విండీస్ జట్టు 31 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఛేజ్, జస్టిన్ గ్రీవ్స్, ఫోర్డ్ లోయర్ ఆర్డర్ లో పరుగులు చేసి విండీస్ జట్టు పరువు కాపాడారు. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఈ విజయంతో ఐర్లాండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

బుధవారం (మే 22) రాత్రి బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో యూఏఈ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఈ విజయంతో యూఏఈ మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ ను 2-1 తేడాతో గెలుచుకోవడం విశేషం. తొలి మ్యాచ్ లో ఓడిపోయిన యూఏఈ.. తర్వాత జరిగిన రెండు టీ20 మ్యాచ్ ల్లో గెలిచి మ్యాచ్ తో పాటు సిరీస్ కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 162 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేజింగ్ లో యూఏఈ 19.1 ఓవర్లలో 166 పరుగులు చేసి గెలిచింది. అలీషన్ షరాఫు 47 బంతుల్లో 68 పరుగులు చేసి యూఏఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Related posts

ఇదికదా మ్యాచ్ అంటే.. నరాలు తెగే ఉత్కంఠ

SIVANANDA BHAGAVATI

ఓటమి బాధలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ పేసర్‌కు మరో ఎదురుదెబ్బ

రోహిత్ రిటైర్మెంట్ నిర్ణయం వెనక ఓ బలమైన కారణం.. ఏం జరిగింది?

M HANUMATH PRASAD

RCB vs PBKS: 17 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ట్రోఫీ.. ఆర్సీబీ గెలుపులో ముగ్గురు హీరోలు

బంగ్లాదేశ్ టూర్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా riyaan ?

M HANUMATH PRASAD

నువ్వు సెంచరీ చేస్తే మ్యాచ్ మఠాషే..!!

M HANUMATH PRASAD