కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్తోందని అత్యున్నత న్యాయ స్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్)పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చేస్తున్న అన్ని సోదాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
ఇది తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వానికి పెద్ద ఊరట కలిగించే అంశం.
”ఈడీ అన్ని పరిమితులను దాటుతోంది.” అని భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ గురువారం కేసు విచారణ సందర్భంగా అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వీ రాజుతో చెప్పినట్లు తెలుస్తోంది. ”మీరు దేశ సమాఖ్య నిర్మాణాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తున్నారు. ” అని సీజేఐ గవాయ్ అన్నారు.41 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయి..టాస్మాక్ ప్రధాన కార్యాలయంలో ఈడీ నిర్వహించిన సోదాలకు వ్యతిరేకంగా మద్రాస్ హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. తమిళనాడు దాఖలు చేసిన పిటిషన్ ను సీజేఐ గవాయ్, జస్టిస్ ఏజీ మసిహ్ లతో కూడిన ధర్మాసనం విచారిస్తోంది.తమిళనాడు తరఫున హాజరైన సీనియర్ న్యాయవాదీ కపిల్ సిబల్ కేసును వాదించారు. అవినీతి ఆరోపణలపై 2014 నుంచి 2021 వరకూ మద్యం దుకాణాల నిర్వాహాకులపై రాష్ట్రమే 41 ఎఫ్ఐఆర్ లు నమోదు చేసిందని అన్నారు. అయితే 2025 లో ఈడీ ప్రధాన కార్యాలయం పై దాడులు చేసి అధికారుల ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు సిబల్ తెలిపారు.”ఇది మద్యం దకాణాలను ఇచ్చే కార్పొరేషన్, దుకాణాలు ఇచ్చిన కొంతమంది వ్యక్తులు వాస్తవానికి నగదు తీసుకుంటున్నట్లు మేము కనుగొన్నాము. కాబట్టి రాష్ట్రం 2014-21 నుంచి కార్పొరేషన్ పై కాకుండా వ్యక్తులపై 41 ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది” అని సిబల్ అన్నారు.ఈడీకి నోటీసులు జారీ..కార్పొరేషన్ పై నేరం ఎలా రుజువైందని సీజేఐ గవాయ్ ఏఎస్జీ రాజును అడిగారు. ”మిస్టర్ రాజు, మీ ఈడీ అన్ని పరిమితులను దాటుతోంది” అని సీజేఐ అన్నారు. ఆ తరువాత ధర్మాసనం పిటిషన్ పై ఈడీకి నోరీ చేయాలని ఆదేశించింది. ”ఈ లోగా పిటిషనర్లపై తదుపరి చర్యలపై స్టే ఉంటుంది” అని ధర్మాసనం పేర్కొంది. వేయి కోట్ల రూపాయల మోసం కేసు అని ఏఎస్జీ రాజు పేర్కొన్నప్పుడూ రాష్ట్రం ఇప్పటికే ఎఫ్ఐఆర్ లు నమోదు చేసి చర్యలు తీసుకుంటోందని సీజేఐ గవాయ్ అన్నారు.సమాఖ్య నిర్మాణం ఉల్లంఘిస్తున్నారు: సీజేఐరాజకీయ నాయకులను రక్షించే ఒక పెద్ద మోసంపై ఈడీ దర్యాప్తు చేస్తోందని ఎఎస్జీ వాదించారు. దీనికి సీజేఐ గవాయ్, ఈడీ అన్ని పరిమితులను దాటుతోంది. దేశ సమాఖ్య నిర్మాణాన్ని ఉల్లంఘిస్తోంది అని ఆయన పదేపదే వ్యాఖ్యానించారు. దీనిని ఖండించిన ఏఎస్జీ రాజు తాను వివరణాత్మక సమాధానం దాఖలు చేస్తామని చెప్పారు.టాస్మాక్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాదీ ముకుల్ రోహత్గీ వాదిస్తూ.. ఈడీ తన అధికారుల ఫోన్ ల క్లోన్ చేసిన కాపీలను తీసుకోవడం ద్వారా వారి గోప్యతను ఉల్లంఘించిందని వాదించారు. ఈ పరికరాల నుంచి సేకరించిన డేటాను ఈడీ ఉపయోగించుకోకుండా నియంత్రించాలని సిబల్ కోర్టు కోరారు. కోర్టు ఇప్పటికే మధ్యంతర ఉపశమనం మంజూరు చేసిందని, తదుపరి ఆదేశాలు జారీ చేయలేమని సీజేఐ గవాయ్ అన్నారు.
