Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్

నంద్యాలకు కొత్త ఇంచార్జ్.. భూమా అఖిలప్రియ పరిస్థితి ఏంటి?

వివాదాస్పద నియోజకవర్గాలపై టిడిపి( Telugu Desam Party) నాయకత్వం దృష్టిపెట్టిందా? అక్కడ ఎమ్మెల్యేలతో నష్టం జరుగుతోందని గుర్తించిందా?

అందుకే దిద్దుబాటు చర్యలకు దిగనుందా? వారి స్థానంలో ఇంచార్జ్ లకు బాధ్యతలు అప్పగించనుందా? అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి తీవ్ర నష్టం జరుగుతున్న నియోజకవర్గాలపై టీడీపీ హై కమాండ్ దృష్టి పెట్టినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 11 అసెంబ్లీ నియోజకవర్గాలలో కొత్త ఇన్చార్జిలను నియమించడానికి కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో ఎక్కువగా రిజర్వుడ్ నియోజకవర్గాలు ఉండడం విశేషం.

* ఎమ్మెల్యేల పనితీరుపై..
ఏపీలో( Andhra Pradesh) టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. క్రమశిక్షణతో ఉండాలని సూచిస్తున్నారు. అయినా సరే కొందరు ఎమ్మెల్యేల తీరులో మార్పు రావడం లేదు. ఈ క్రమంలోనే కఠిన చర్యలకు దిగుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా తిరువూరు, రైల్వే కోడూరు, రాజంపేట, సింగనమల, ఆళ్లగడ్డ నియోజకవర్గాలు ఈ జాబితాలో ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తరచు వివాదాల్లో చిక్కుకోవడం పార్టీకి మైనస్ గా మారింది. అందుకే చాలాసార్లు హెచ్చరించినా.. ఫలితం లేకపోవడంతో వారి స్థానంలో ఇన్చార్జిలను తెస్తారని తెలుస్తోంది. అదే జరిగితే విభేదాలు మరింత ముదరడం ఖాయం.

* సొంత పార్టీ శ్రేణుల నుంచి వ్యతిరేకత
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో( Allagadda ) ఎమ్మెల్యే అఖిల ప్రియ పరిస్థితి మరింత వివాదంగా మారుతోంది. ఇక్కడ సొంత పార్టీ శ్రేణులే ఆమె తీరును వ్యతిరేకిస్తున్నారు. అందుకే సీఎం చంద్రబాబు తో పాటు మంత్రి లోకేష్ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇక్కడ టిడిపి సమన్వయకర్తగా చింతకుంట శ్రీనివాసరెడ్డి నియమించడానికి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. శ్రీనివాస్ రెడ్డికి రాజకీయ నేపథ్యం ఉంది. ఈయన తాత సిపి తిమ్మారెడ్డి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎమ్మెల్యే అఖిలప్రియ కు సమీప బంధువు కూడా. అఖిల ప్రియ తీరు రోజురోజుకు వివాదంగా మారడంతో.. ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని చూసుకోవాలని టిడిపి హై కమాండ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా శ్రీనివాస్ రెడ్డిని ఇన్చార్జిగా నియమిస్తారని సమాచారం.

* అనుచరులపై ఆరోపణలు..
శ్రీనివాసరెడ్డి ( Srinivas Reddy) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. హైదరాబాద్ తో పాటు రాజమండ్రిలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొనసాగుతున్నారు. ఇటీవల కాలంలో చికెన్ సెంటర్ ల నుంచి కూడా అఖిలప్రియ అనుచరులు కమీషన్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు టిడిపి ప్రతిష్టను మరింత ఇబ్బందుల్లో పెట్టాయి. స్థానిక పార్టీ శ్రేణులు సైతం అఖిలప్రియ తీరుపై హై కమాండ్కు ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలో టిడిపి పెద్దలు అక్కడ నాయకత్వం మార్పుతోనే వ్యతిరేకత తగ్గించుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే శ్రీనివాస్ రెడ్డికి ఆళ్లగడ్డ నియోజకవర్గం అప్పగిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

Related posts

తెలుగు చిత్ర పరిశ్రమకు చాలా రోజుల తరువాత మంచి హిట్ మూవీ -నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి

M HANUMATH PRASAD

సుప్రీంకోర్టు ముందు విడ్డూరపు నాటకం

M HANUMATH PRASAD

విజయసాయి.. చంద్రబాబుకు లొంగిపోయాడు..

M HANUMATH PRASAD

అమరావతి సక్సెస్ కాదు-మొండిగా ముందుకెళ్లొద్దు-బాబుకు మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ సలహా..!

M HANUMATH PRASAD

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం

GIT NEWS

ధనుంజయ్ రెడ్డిపై వైసీపీలో ఇంత వ్యతిరేకతా

M HANUMATH PRASAD