Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
అంతర్జాతీయం

వాషింగ్టన్‌లో ఉగ్రదాడి.. ఇజ్రాయెల్‌ ఎంబసీ ఉద్యోగులను కాల్చి చంపిన ముష్కరులు

అగ్రరాజ్యం అమెరికాలో ఉగ్రదాడి కలకలం రేపింది. వాషింగ్టన్‌ డీసీ (Washington DC)లోని ఇజ్రాయెల్‌ ఎంబసీ (Israeli Embassy) ఉద్యోగులపై ఉగ్రవాదులు దాడి చేశారు.

సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం సిబ్బంది మృతి చెందారు.

అమెరికా హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోయెమ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కేపిటల్‌ జెవిష్‌ మ్యూజియం (Jewish Museum) సమీపంలో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. మ్యూజియంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన సిబ్బందికి అతి సమీపంగా వచ్చిన ముష్కరులు కాల్పులు జరిపారు. మృతుల్లో ఓ మహిళ కూడా ఉన్నట్లు తెలిసింది. కాల్పుల అనంతరం ఉగ్రవాదులు ప్రీ పాలస్తీనా నినాదాలు చేశారు. ఈ ఘటనను ఇజ్రాయెల్ యూఎన్‌ రాయబారి డానీ డానన్‌ తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిపై అమెరికా అధికారులు చర్యలు తీసుకుంటారని తాము విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు నివసించే వాషింగ్టన్‌ డీసీ నగరంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అలాంటి చోట ఉగ్రదాడి జరగడం కలకలం రేపుతోంది.

 

Related posts

భారత్‌ చర్యల నేపథ్యంలో.. భుట్టో నేతృత్వంలో విదేశాలకు పాకిస్థాన్‌ నేతలు

M HANUMATH PRASAD

పాక్‌ నుంచి అఫ్గాన్‌ సరుకు ట్రక్కులకు అనుమతి

M HANUMATH PRASAD

బలూచ్ వేర్పాటు వాదులకు భారత్ మద్దతిస్తే!?

M HANUMATH PRASAD

పాకిస్తాన్ క్రికెట్ బోర్డును దేవుడే ఆదుకోవాలి

M HANUMATH PRASAD

అడ్రస్‌ లేకపోతే తిహాడ్‌ జైలులోనే ఉంటారు

M HANUMATH PRASAD

ఇండియాతో ఆ బిజినెస్ చేయొద్దు.. ట్రంప్ వార్నింగ్

M HANUMATH PRASAD