Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్

జోహార్ సీఎం చంద్రబాబు.. జోహార్ లోకేష్.. ‘గంటా’ కొడుకు పరువు తీశాడుగా..!

టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా మినీ మహానాడు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. విశాఖపట్నంలో జరిగిన మినీ మహానాడు కార్యక్రమానికి మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజ హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో గంటా శ్రీనివాసరావు ప్రసంగిస్తుండగా, గంటా రవితేజ సభికుల ముందుకు వచ్చి నినాదాలు చేశారు. ఈ నినాదాలు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపినప్పటికీ, రవితేజ చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

కార్యకర్తల్లో జోష్ నింపే ఉద్దేశంతో ఆయన చంద్రబాబు , లోకేష్ పై చేసిన నినాదాలు వైరల్ అయ్యాయి. ‘జోహార్ చంద్రబాబు.. జోహార్ లోకేష్’ అంటూ రవితేజ నినదించగా, టీడీపీ కార్యకర్తలు కూడా ఆయనతో గొంతు కలిపారు. కొద్దిసేపటి తర్వాత జరిగిన తప్పిదాన్ని కొందరు గుర్తించి, దానిని సరిచేసే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

– సోషల్ మీడియాలో వైరల్

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ వీడియోను విస్తృతంగా ప్రచారం చేస్తోంది. రవితేజ వ్యాఖ్యలపై ” బతికునోళ్లకు జోహార్లు ఏంటయ్యా..” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

– రాబోయే ఎన్నికల్లో రవితేజ బరిలోకి?

ప్రస్తుతం భీమిలి ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఆయన రాజకీయ వారసుడిగా కుమారుడు రవితేజను బరిలోకి దించుతారని తెలుస్తోంది. రవితేజ కూడా టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, రాబోయే రోజుల్లో పార్టీలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా భీమిలి నియోజకవర్గంలో రవితేజ అన్ని వ్యవహారాలను చక్కబెడుతున్నారు.

Related posts

తుని మూగ జీవాల ఆశ్రమం పై దాడి ఘటనలో కుట్ర కోణం?

M HANUMATH PRASAD

ఇల్లు కడుతున్నవ్​ కదా.. పైసలియ్యి!..ఇంటి నిర్మాణదారుడిని బెదిరించిన వ్యక్తి

M HANUMATH PRASAD

జగన్ మంచితనం వల్లనే మేము సంకనాకి పోయాము – వైసీపీ మాజీ ఎమ్మెల్యే

M HANUMATH PRASAD

జవాన్ సమస్యపై స్పందించిన సీఎం చంద్రబాబు.

M HANUMATH PRASAD

రఘురామపై టార్చర్ కేసులో కీలక పరిణామం..! సీనియర్ ఐపీఎస్ కు బిగ్ షాక్..!

M HANUMATH PRASAD

వివాదాల చుట్టూ చెన్నై ఆంధ్రా క్లబ్ ఎన్నికలు