Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్

తాగి రోడ్లపై తిరగండి.. పోలీసులు ఆపితే ఫోన్ చేయండి

రాష్ట్ర మంత్రి ఎన్ఎం డి ఫరూక్( nmd Farooq) కుమారుడు ఫిరోజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. మొన్నటి ఎన్నికల్లో కర్నూలు నుంచి గెలిచారు ఫరూక్.

ఆయనను చంద్రబాబు తన క్యాబినెట్లో తీసుకున్నారు. కీలకమైన మైనారిటీ సంక్షేమ శాఖను అప్పగించారు. అయితే తండ్రి ఫరూక్ కంటే కుమారుడు ఫిరోజ్ రాజకీయంగా యాక్టివ్ గా ఉంటారు. గతంలో వైసిపి హయాంలో ఆయనపై దాడి ఘటనలు కూడా జరిగాయి. ప్రస్తుతం టిడిపి జిల్లా కార్యదర్శిగా కొనసాగుతున్నారు ఫిరోజ్. తాజాగా నంద్యాలలో జరిగిన మినీ మహానాడులో ఫిరోజ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

* మినీ మహానాడు వేదికపై..
ఈనెల 27 నుంచి మూడు రోజులపాటు కడప జిల్లాలో మహానాడు( mahanadu ) జరగనున్న సంగతి తెలిసిందే. అంతకంటే ముందే రాష్ట్రవ్యాప్తంగా మినీ మహానాడు నిర్వహించాలని పార్టీ హైకమాండ్ ఆదేశాలు ఇచ్చింది. అందులో భాగంగా నంద్యాలలో మినీ మహానాడు జరిగింది. ముఖ్యఅతిథిగా మంత్రి ఫరూక్ కుమారుడు ఫిరోజ్ హాజరయ్యారు. టిడిపి శ్రేణులు ఆయనను ఘనంగా సన్మానించాయి. ఈ సందర్భంగా ఫిరోజ్ ఉత్సాహంగా మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అదే పనిగా ప్రచారం చేయడం ప్రారంభించింది.

శ్రేణులను ఉత్సాహపరిచే క్రమంలో..
మంత్రి కుమారుడు ఫిరోజ్ ( Feroz )టిడిపి శ్రేణులను ఉత్సాహపరిచే క్రమంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. గత ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ పాలనలో టిడిపి శ్రేణులు ఇబ్బంది పడిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అందుకే టిడిపి శ్రేణులు ధైర్యంగా రోడ్డుమీద తిరగండి.. తాగి ఎంజాయ్ చేయండి.. పోలీసులు ఆపితే తనకు ఫోన్ చేయండి అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రధానంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిపై పెద్ద ఎత్తున వైరల్ చేస్తోంది. విశాఖలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు జోహార్ చంద్రబాబు, జోహార్ లోకేష్ అంటూ అత్యుత్సాహంతో నినాదాలు చేశారు. అది కూడా మినీ మహానాడు వేదికపై నుంచే.. ఇప్పుడు మంత్రి కుమారుడు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని తప్పు పడుతూ ప్రచారం చేసుకుంటుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.

Related posts

సజ్జల భార్గవరెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

M HANUMATH PRASAD

జగన్ అరెస్టుకు నో చాన్స్?.. తెరవెనుక పెద్ద రాజకీయ వ్యూహం!

M HANUMATH PRASAD

ఏపీలో మరో కొత్త రైల్వే లైన్ రాబోతుంది. త్వరలోనే టెండర్లు!

M HANUMATH PRASAD

వారికి బెయిల్ ష్యూరిటీ ప్రభుత్వం చెల్లించాలి…: సుప్రీం కోర్టు

M HANUMATH PRASAD

వల్లభనేని వంశీకి బెయిల్

M HANUMATH PRASAD

అప్పట్లో అప్పలరాజు తిట్టాడు.. ఇప్పుడు పోలీసులు తిట్టారు !

M HANUMATH PRASAD