Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
జాతీయ వార్తలు

షాహి జామా మసీదు సర్వే పై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు

సంభల్‌లోని షాహి జామా మసీదు సర్వే (Shahi Jama Masjid Survey)పై అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) కీలక తీర్పు ప్రకటించింది.

మే 13 అలహాబాద్ హైకోర్టులో జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్‌ (Single Judge Bench)లో ఈ పిటిషన్‌పై వాదనలు పూర్తవ్వగా.. కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ రోజు మధ్యాహ్నం కోర్టు తుది తీర్పును ప్రకటించింది. “సంభాల్‌లోని షాహి జామా మసీదు సర్వే ఉత్తర్వును అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. ట్రయల్ కోర్టు జారీ చేసిన ముస్లిం పక్షం పిటిషన్‌ను తిరస్కరించారు. ట్రయల్ కోర్టు ఉత్తర్వులతో కోర్టుకు ఎటువంటి సమస్యలు లేవని తెలిపింది.” ఈ మసీదు 1520లో మొఘల్ చక్రవర్తి బాబర్ హరిహర ఆలయాన్ని కూల్చి దాని స్థానంలో నిర్మించినట్లు హిందూ పక్షం ఆరోపించింది. ఈ వాదన ఆధారంగా, స్థానిక సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది, దీనిలో మసీదు స్థలంపై సర్వే నిర్వహించాలని కోరారు.

ఈ పిటిషన్ పై విచారించిన తర్వాత 2024, నవంబర్ 19 సంభల్ సివిల్ కోర్టు (Civil Court) మసీదు స్థలంలో సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ఈ సర్వే రెండు దశల్లో నిర్వహించబడింది. కానీ సర్వే సమయంలో స్థానికంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి, దీనిలో నలుగురు మరణించారు. ఆ సమయంలోనే మసీదు కమిటీ (ఇంతజామియా కమిటీ) సివిల్ కోర్టు ఆదేశించిన సర్వేను వ్యతిరేకిస్తూ అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court)లో సివిల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌లో సివిల్ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ.. ఈ సర్వే 1991లోని ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్‌ను ఉల్లంఘిస్తుందని వాదించారు. మే 13న అలహాబాద్ హైకోర్టులో జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్‌లో ఈ పిటిషన్‌పై వాదనలు విన్న తర్వాత నేడు తుది తీర్పును ఇచ్చింది.

Related posts

మంత్రిగా డబ్బులు రావట్లేదు.. సినిమాలే చేసుకుంటా : కేంద్రమంత్రి సురేశ్‌ గోపీ

M HANUMATH PRASAD

తప్పించుకోబోయే తెగించి ప్రాణం తీసుకున్నాడు

డీకేశికి బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, గట్టి చట్నీ పెట్టి డీల్ క్లోజ్ చేసిన సిద్ధు..!!

M HANUMATH PRASAD

కాంగ్రెస్ కు అధికారం కష్టమే: చిదంబరం

M HANUMATH PRASAD

ఆలయాలపై కులాధిపత్యం ఇంకెన్నాళ్లు?

M HANUMATH PRASAD

ప్రత్యేక బెంచ్‌ను నియమించిన బాంబే హైకోర్టు

M HANUMATH PRASAD