Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
సినిమా వార్తలు

స్టేజిపై ఏడ్చేసిన మంచు మనోజ్.. కట్టుబట్టలతో రోడ్డుపై పెట్టేశారు.. కార్లు లాగేసుకున్నారు

మంచు ఫ్యామిలీలో గతకొన్ని నెలలుగా వరుస గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మంచు ఫ్యామిలీ గొడవ టాలీవుడ్ సర్కిల్లో ప్రతిసారి హాట్ టాపిక్గా మారింది.

ఒకరిపై ఒకరు ఫిర్యాదులతో ఈ వివాదం మరింత రచ్చకెక్కుతూ వస్తోంది. ఈ క్రమంలో మంచు కుటుంబం నుంచి వరుస సినిమాలు రిలీజ్ అవుతుండటం వల్ల తమ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఓ వైపు కన్నప్ప, మరోవైపు మనోజ్ భైరవం

లేటెస్ట్గా మంచు మనోజ్ నటించిన మూవీ భైరవం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లీడ్ రోల్స్‌లో నటించారు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో కెకె రాధామోహన్ నిర్మించారు. ఈ మూవీ మే 30న విడుదల కానుంది. ఇప్పటికే పవర్‌ఫుల్ పోస్టర్లు, టీజర్, మూడు పాటలతో అంచనాలు పెంచిన మేకర్స్.. ఆదివారం మే 19న ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా మంచు మనోజ్ స్టేజిపై మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తన AV, అభిమానుల అన్న అనే అరుపులు మనోజ్ ను మరింత ఎమోషనల్ అయ్యేలా చేశాయి. దాంతో తన సినిమాల ప్రస్తావన గుర్తుచేసుకుంటూ.. 9 ఏళ్ళ సినిమా కెరీర్ కు వచ్చిన గ్యాప్ కారణాలు పంచుకున్నాడు. సొంతోళ్లే నన్ను దూరం పెట్టారు. కానీ, ఏం ఇవ్వని మీరు (అభిమానులు) మాత్రం ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా నా వెన్నంటే ఉన్నారని అన్నారు.

తన కుటుంబం కట్టుబట్టలతో తన కుటుంబాన్ని రోడ్డు మీద పెట్టారని, ఒకసారి ఊరికి వెళ్లి వచ్చేసరికి బట్టలతో పాటు చిన్నప్పటి నుంచి పెట్టుకున్న గుర్తులు ఏదీ లేకుండా చేశారని చెప్పారు. బయటికి ఎక్కడికైనా వెళ్లేందుకు కార్లు కూడా లేవు. కార్లు కూడా తీసుకెళ్లిపోయారని మంచు మనోజ్ అన్నారు.

కానీ, ఆ శివుడు ఫ్యాన్స్ రూపంలో ఇంటి ముందు 20 కార్లు పెట్టారని మనోజ్ తెలిపారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. కేసులు వేసినా నాకు ఎవరి మీద కోపం రావడం లేదు. బాధ ఒకటే వేస్తోంది. అది నా బలహీనతో.. వాళ్ల బలమో అర్థం కావడం లేదు. ఈ జన్మలో నా కట్టె కాలే వరకు నేను మోహన్ బాబు అబ్బాయినే. ఇది ఎవరు మార్చలేరని మనోజ్ తన మనసులో మాట చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మనోజ్ మాట్లాడిన ఈ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది

 

Related posts

సినీ పరిశ్రమ ఐసీయూలో ఉంది.. ఎగ్జిబిటర్ల వివాదంపై స్పందించిన నిర్మాత ఎస్‌కేఎన్‌

M HANUMATH PRASAD

మీకు కనీస కృతజ్ఞత లేదు.. సినిమా వాళ్లెవరూ వ్యక్తిగతంగా రావద్దు: డిప్యూటీ సీఎం పవన్‌

M HANUMATH PRASAD

నెలకు రూ.40 లక్షల భరణం ఇవ్వు.. జయం రవి భార్య పిటిషన్..

రాజ్ తరుణ్ కు ఇల్లు అప్పగించాల్సిందే – లావణ్యకు హై కోర్ట్ బిగ్ షాక్

M HANUMATH PRASAD

కమల్ హాసన్ అహంకారానికి ఇది నిదర్శనం, విమర్శలతో విరుచుకుపడిన విజయేంద్ర యడియూరప్ప

M HANUMATH PRASAD

నిర్మాతల సమావేశంలో సురేష్ బాబు అసహనం..ఆవేశంతో తలుపులు బద్దలు కొట్టిన నిర్మాత!

M HANUMATH PRASAD