Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
క్రైమ్ వార్తలు

పంతలమ్మ, పంతులయ్యకు రెండో వివాహం… పెళ్లిని చెడగొట్టిన మరో ఉపాధ్యాయుడు

పంతులు ఓ పంతులమ్మను రెండో వివాహం చేసుకుంటుండగా మరో ఉపాధ్యాయుడు ఈ పెళ్లిని చెడగొట్టాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా పాల్వంచలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ వ్యక్తి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.

పెళ్లి జరిగిన కొన్ని రోజులకే భార్య చనిపోవడంతో రెండో వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. పాల్వంచకు చెందిన ఓ యువతి(29)కి భర్తతో విభేదాలు రావడంతో విడాకులు తీసుకొని తన కూతురుతో కలిసి ఉంటుంది. ఆమె ఓ ప్రైవేటు స్కూళ్లో టీచర్ గా పని చేస్తుంది. ఉపాధ్యాయుడు పరిచయం కావడంతో ఇరు వైపుల కుటుంబ సభ్యులు పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

పాల్వంచలోని ఓ ప్రార్థనా మందిరంలో పెళ్లి చేసుకుంటుండగా మరో ప్రభుత్వ ఉపాధ్యాయుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. వెంటనే వధువును తాను ప్రేమించానని తానే పెళ్లి చేసుకుంటానని, తనకు మొదటి భార్య ఉంది కానీ పిల్లలు లేకపోవడంతో విడాకులు తీసుకొని పందింట్లో ఉన్న యువతిని పెళ్లి చేసుకుంటానని హల్‌చల్ చేశాడు. సదరు యువతితో తనకు అక్రమ సంబంధం ఉందని చెప్పాడు. దీంతో బంధువుల ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే వధువు బంధువులు అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. అక్కడి నుంచి అతడు తప్పించుకున్నాడు. వరుడి, ఆయన కుటుంబ సభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో పెళ్లి రద్దు కావడంతో వధువు స్థానిక పోలీస్ స్టేషన్‌లో వివాహం చెడగొట్టిన ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

తప్పుడు కేసా.. కాదా అన్నది మేము తేలుస్తాం

M HANUMATH PRASAD

ఆధార్ కార్డు వాట్సాప్‌లో పంపిస్తే చాలు.. ఏ డిగ్రీ సర్టిఫికేటైనా కొరియర్‌లో మీ ఇంటికి!

M HANUMATH PRASAD

గచ్చిబౌలిలో బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ..రోడ్డున పడ్డ 200 మంది ఉద్యోగులు

M HANUMATH PRASAD

విజయనగరాన్ని సిరాజ్ ఎందుకు ఎంచుకున్నాడంటే?

M HANUMATH PRASAD

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు ఉగ్రవాదులతో సంబంధాల్లేవ్: పోలీసులు

M HANUMATH PRASAD

పబ్లిసిటీ స్టంట్లు అవసరమా..: ప్రొఫెసర్‌పై సుప్రీం పైర్

M HANUMATH PRASAD