Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
క్రైమ్ వార్తలుజాతీయ వార్తలు

పాక్‌ సైన్యానికి సపోర్ట్‌గా సోషల్‌ మీడియా పోస్టులు.. గవర్నమెంట్ టీచర్‌పై సస్పెన్షన్‌ వేటు..!

మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌కు చెందిన ఒక ఉపాధ్యాయురాలు పాకిస్తాన్ సైన్యానికి అనుకూలంగా ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ తర్వాత ఆమెను విధుల నుంచి తొలగిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

షహనాజ్ పర్వీన్ అనే ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. మెహత్వారాలోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్ టీచర్ షహనాజ్ పర్వీన్‌ తన ఫేస్‌బుక్‌లో పాకిస్తాన్ సైన్యానికి అనుకూలంగా ఒక వీడియోను షేర్ చేసింది. ఇది కాస్తా వైరల్‌గా మారడంతో జిల్లా విద్యాశాఖ అధికారి సంజయ్ సింగ్ తోమర్ ఆమె సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఆ వీడియోలో ఆ టీచర్ పాకిస్తాన్ సైన్యం భద్రత కోసం ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. మే 13న, జిల్లా విద్యాశాఖ అధికారి సంజయ్ సింగ్ తోమర్, అష్ట SDM స్వాతి మిశ్రాను దర్యాప్తు చేయమని కోరారు. దీంతో SDM స్వాతి మిశ్రా దర్యాప్తు చేసి శుక్రవారం నివేదికను సమర్పించారు. ఆ తర్వాత ఈ చర్య తీసుకున్నారు. పాకిస్తాన్ సైన్యానికి అనుకూలంగా సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయడం ద్వారా టీచర్ షహనాజ్ పర్వీన్ భారత పౌర భద్రతా నియమావళిని ఉల్లంఘించింది. దీంతో ఆమెపై సస్పెన్షన్ వేటు పడింది.

ఇది దుష్ప్రవర్తనగా పరిగణించి, సెక్షన్ 163, ఇతర నిబంధనల ప్రకారం సదరు ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేశారు. టీచర్ షహనాజ్ పర్వీన్ సెహోర్‌లోని జావర్ నివాసి. అయితే పాకిస్థాన్‌కు మద్దతుగా ఒక వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో వైరల్ అయింది. దీంతో నెటిజన్లు దానిపై తీవ్రంగా స్పందించడం ప్రారంభించారు. దీని తరువాత ఈ విషయంపై చర్చ ప్రారంభమైంది. ఆ వీడియోను షేర్ చేసినందుకు ఆ టీచర్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. వీడియోను షేర్ చేసే విషయం విద్యా శాఖకు చేరింది. దర్యాప్తు చేపట్టిన విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుని, ఆ ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని, వాటికి దూరంగా ఉండాలి. అటువంటి పరిస్థితిలో, ఇప్పుడు ఆ ఉపాధ్యాయురాలిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి..!

Related posts

పదవీ విరమణ సందర్భంగా సుప్రీంకోర్టు జస్టిస్ ఏఎస్ ఓకా కీలక వ్యాఖ్యలు

M HANUMATH PRASAD

రాహుల్‌ ముఖానికి నల్ల రంగు పూస్తాం

M HANUMATH PRASAD

ప్రత్యేక బెంచ్‌ను నియమించిన బాంబే హైకోర్టు

M HANUMATH PRASAD

ఛీ.. ఛీ.. నడి రోడ్డు మీద యువతి పెదాలపై ముద్దులు.. వెలుగులోకి కామాంధుడి పైత్యం.. వీడియో వైరల్..

M HANUMATH PRASAD

రియాద్‌ ఆసుపత్రిలో చేరిన గులాంనబీ ఆజాద్‌

M HANUMATH PRASAD

రాష్ట్రపతికి సుప్రీం కోర్టు డెడ్‌లైన్‌ పెట్టొచ్చా.. ద్రౌపది ముర్ము సంచలన వ్యాఖ్యలు

M HANUMATH PRASAD