Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
జాతీయ వార్తలు

బదిలీపై వెళ్తున్న పోలీస్.. వెళ్లొదంటూ వెక్కివెక్కి ఏడ్చిన జనం.. వైరల్‌ అవుతున్న వీడియో!

ఓ పోలీస్ అధికారి ట్రాన్స్‌ఫర్‌పై వేరే ప్రాంతానికి వెళ్తుంటే స్థానిక జనం అంత కన్నీళ్లు పెట్టుకున్న ఘటన నార్త్ ఢిల్లీలోని సబ్జీమండి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే సబ్జీమండి పోలీస్ స్టేషన్‌లో మిశ్రా అనే వ్యక్తి ఎస్‌హెచ్‌వో (SHO)గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల ఆయనకు మరో ప్రాంతానికి ట్రాన్స్‌ఫర్ అయ్యింది. దీంతో అతని ఆ ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో స్టేషన్‌లోని తోటి సిబ్బందికి వెళ్తున్నట్టు చెప్పి స్టేషన్‌ నుంచి బయటకు వచ్చాడు. అయితే అప్పటికే అతని కోసం బయట ఎదురుచూస్తున్న జనం ఆయనను చుట్టుముట్టారు. మీరు వెళ్లొద్దు ఇక్కడే ఉండండి అని మిశ్రాను కోరారు. కొందరైతే ఆయన అక్కడి నుంచి వెళ్లడం తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన్ను కౌగిలించుకుని ఏడ్వడం స్టార్ట్‌ చేశారు.

అసలు ఓ పోలీస్ అధికారి వెళ్తుంటే సాధారణ జనం ఎందుకు ఇంతలా బాధపడుతున్నారంటే. ఆయన అక్కడ సర్వీస్‌లో ఉన్నన్ని రోజులు స్థానిక ప్రజలందరిలో మమేకంగా మెలిగేవారు. అక్కడి ప్రజలకు ఎలాంటి కష్టాలు వచ్చినా అండగా ఉండేవారట అందుకే వాళ్లు ఇంతలా బాధపడుతున్నది.

మాకోసం 24/7 పనిచేసే మంచి పోలీస్ మిశ్రా ఆయన్ను బదిలీ చేయొద్దంటూ స్థానిక జనాలు మీడియా ద్వారా ఉన్నతాధికారులను వేడుకున్నాడు. మీశ్రా బదిలీని రద్దు చేసి ఇక్కడే ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియలో వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు అందరూ పోలీస్ అంటే ఇలా ఉండాలి అంటున్నారు.

Related posts

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు ఉగ్రవాదులతో సంబంధాల్లేవ్: పోలీసులు

M HANUMATH PRASAD

కొన్ని పాక్‌ జెట్‌లను కూల్చివేశాం.. ఐదుగురు సైనికులను కోల్పోయాం: త్రివిధ దళాధికారులు

M HANUMATH PRASAD

కోర్టు ముందు సీబీఐ హాజరు కాకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

M HANUMATH PRASAD

ప్రియుడితో దగ్గరుండి పెళ్లి చేసిన భర్త.. వీడియో వైరల్..

M HANUMATH PRASAD

సుప్రీం జడ్జీలుగా ముగ్గురు

M HANUMATH PRASAD

రాహుల్ కు ఈసీ స్వీట్ వార్నింగ్

M HANUMATH PRASAD