చార్ ధామ్ యాత్రలో అనుకొని ఘటన చోటు చేసుకుంది. భక్తులతో వెళ్తున్న హెలికాప్టర్ ఒక్కసారిగా ల్యాండింగ్ కు ముందు క్రాష్ అయ్యింది
హెలికాప్టర్ తోక భాగం పూర్తిగా డ్యామెజ్ అయ్యింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
కేదార్ నాథ్ ధామ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే.. దీనిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అత్యవసర ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ వెనుక భాగం విరిగిపోయింది. హెలికాప్టర్‌లో ఉన్న ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు. ఈ హెలికాప్టర్ ప్రభుత్వానికి చెందినదిగా సమాచారం. ఈక్రమంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. కొన్నిరోజుల క్రితమే కేదార్ నాథ్ యాత్ర ప్రారంభమైంది.
అయితే.. ఇండియా, పాక్ ఉద్రిక్తతల మూలంగా ఈసారి అంత భక్తుల రద్దీలేదని సమాచారం. ఈ క్రమంలో రెండు తెలుగు స్టేట్స్ నుంచి కూడా భక్తులు కేదార్ నాథ్ యాత్రకు వెళ్తున్నారు. ఈ ఘటనతో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దీనిపై ప్రస్తుతం అధికారులు విచారణ చేపట్టారు.
భారత హిమాలయాల్లోని కేదారీనాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యుమునోత్రిని చార్‌ధామ్ యాత్ర అంటారు. చార్‌ధామ్ యాత్రలో భాగంగా మొదటగా గంగోత్రి, యమునోత్రి ఆలయాలు అక్షయ తృతీయను పురస్కరించుకుని ఏప్రిల్ 30న తెరుచుకుంది.
కేదార్నాథ్ ఆలయాన్ని మే 2 ఉదయం 7గంటలకు తెరిచి భక్తులకు స్వామివారి దర్శనంను అధికారులు కల్పించారు. బద్రినాథ్ ఆలయం మే 4న తెలుచుకుంది. ప్రస్తుతం ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో చార్ ధామ్ కు వెళ్లే భక్తులు సంఖ్య పెరగొచ్చని అధికారులు భావిస్తున్నారు.
