Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
అంతర్జాతీయం

బంగ్లాదేశ్ కు చావుదెబ్బ కొట్టిన కేంద్ర ప్రభుత్వం

పొరుగు దేశం బంగ్లాదేశ్‌ కు వ్యాపారపరంగా చావుదెబ్బ కొట్టింది భారత్. ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే పలు రకాల వస్తువులు, ఆహార పదార్థాలపై ఆంక్షలు విధించింది.

ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) కొద్దిసేపటి కిందటే ఓ నోటిఫికేషన్ జారీ చేసింది.

హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులు, గృహ దహనాలు, అఘాయిత్యాలు, ఆకృత్యాలతో అట్టుడికింది బంగ్లాదేశ్. రోజుల తరబడి ఇవి కొనసాగుతూ వచ్చాయి. భారత్ సహా ఇతర దేశాలు బంగ్లాదేశ్ ప్రభుత్వంపై అన్ని రకాలుగా ఒత్తిళ్లు తీసుకొస్తోన్నప్పటికీ- దీనికి మాత్రం చాలాకాలం పాటు బ్రేకులు పడలేదు.

ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) కొద్దిసేపటి కిందటే ఓ నోటిఫికేషన్ జారీ చేసింది.

హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులు, గృహ దహనాలు, అఘాయిత్యాలు, ఆకృత్యాలతో అట్టుడికింది బంగ్లాదేశ్. రోజుల తరబడి ఇవి కొనసాగుతూ వచ్చాయి. భారత్ సహా ఇతర దేశాలు బంగ్లాదేశ్ ప్రభుత్వంపై అన్ని రకాలుగా ఒత్తిళ్లు తీసుకొస్తోన్నప్పటికీ- దీనికి మాత్రం చాలాకాలం పాటు బ్రేకులు పడలేదు.

గత ఏడాది ఆగస్టు 5వ తేదీన ప్రధానమంత్రి షేక్ హసీనా సారథ్యంలోని ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. అప్పటి నుంచీ బంగ్లాదేశ్‌లో అమానుష ఘటనలు చోటు చేసుకుంటూ వచ్చాయి. ప్రత్యేకించి- హిందువులపై విపరీతంగా దాడులు కొనసాగాయి. దోపిడీలు, గృహ దహనాలు నిత్యకృత్యం అయ్యాయి.

హిందువులతో పాటు ఇతర మైనారిటీలపై ఇస్లామిక్ మతఛాందసవాదులు విరుచుకుపడ్డారు. హైందవ ఆలయాలను ధ్వంసం చేయడం, భక్తిశ్రద్ధలతో పూజలందుకున్న విగ్రహాలను పగులగొట్టడం, మంటల్లో పడేయడం, తగులబెట్టడం రోజువారీ కార్యక్రమంగా మారిందక్కడ. మహ్మద్ యూసుస్ సారథ్యంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఎలాంటి ఫలితమూ కనిపించలేదు అప్పట్లో.

ఇస్కాన్ ప్రతినిధి, బంగ్లాదేశ్ సమ్మిళిత్ సనాతన్ జాగరణ్ జొటె నాయకుడు చిన్మయ్ కృష్ణ దాస్‌ను అరెస్ట్ చేయడం దీనికి పరాకాష్ఠగా మారింది. తమ దేశ జాతీయ పతాకాన్ని అవమానపరిచారనే కారణంతో గత ఏడాది నవంబర్ 25వ తేదీన ఆయన అరెస్ట్ అయ్యారు. ఢాకా చిత్తోగ్రామ్‌లోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

చిన్మయ్ కృష్ణ దాస్‌ను వెంటనే విడుదల చేయాలని, హిందువులపై దాడులను అడ్డుకునేలా బంగ్లాదేశ్ ప్రభుత్వం అంతర్జాతీయ వేదికల ద్వారా ఒత్తిడిని తీసుకుని రావాలంటూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సైతం కేంద్రానికి డిమాండ్ చేసింది. అయినప్పటికీ ఎలాంటి ఉపయోగం ఉండట్లేదు. ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన ఆయనకు బెయిల్ లభించినప్పటికీ- రెండు రోజుల్లో మళ్లీ అరెస్ట్ అయ్యారు.

ఈ పరిణామాలను ద్రష్టిలో ఉంచుకుని భారత్- తాజాగా పలు నిర్ణయాలు తీసుకుంది. ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే పలు రకాల వస్తువులు, ఆహార పదార్థాలపై ఆంక్షలు విధించింది. రెడీమేడ్ దుస్తులు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు సహా పలు వస్తువులను బంగ్లాదేశ్ నుండి దిగుమతి చేసుకోవడంపై పోర్ట్ పరిమితులను విధించింది

ఈ ఆంక్షలు భారత్ గుండా నేపాల్, భూటాన్‌లకు రవాణా అయ్యే బంగ్లాదేశ్ వస్తువులకు వర్తించవు. అవి యధాతథంగా కొనసాగుతాయి. భారత్ లో దిగుమతులపై మాత్రమే ఈ పోర్ట్ ఆంక్షలు విధించింది కేంద్రం. బంగ్లాదేశ్ నుండి రెడీమేడ్ వస్త్రాల దిగుమతులను ఏ ల్యాండ్ పోర్టు నుండి అనుమతించబోమని ఉత్తర్వులో పేర్కొంది.

పండ్లు, ఫ్రూట్ ఫ్లేవర్డ్ కార్బొనేటేడ్ డ్రింక్స్, ప్రాసెసింగ్ ఫుడ్, బేక్డ్ గూడ్స్, స్నాక్స్, చిప్స్, కొన్ని రకాల స్వీట్స్, పత్తి, కాటన్ యార్న్ వేస్ట్, ప్లాస్టిక్, పీవీసీ ఫినిష్డ్ గూడ్స్, రంగులు, ప్లాస్టిసైజర్లు, గ్రాన్యుల్స్, వుడెన్ ఫర్నిచర్.. వంటి వస్తువులు ఈ జాబితాలో ఉన్నాయి.

పోర్టులతో పాటు అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాంలలోని ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్లు, ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు, పశ్చిమ బెంగాల్‌లోని ఫుల్బారి వాటిని భారత్ లోకి అనుమతించరాదని ఈ నోటిఫికేషన్ పేర్కొంది. బంగ్లాదేశ్ నుండి చేపలు, ఎల్పీజీ, ఈడిబుల్ ఆయిల్ దిగుమతులకు ఈ ఆంక్షలు వర్తించవు. ఇది- తక్షణమే అమలులోకి వస్తుందని కేంద్రం పేర్కొంది.

 

 

Related posts

మరో నగరాన్ని స్వాధీనం చేసుకున్న బిఎల్ ఎ

M HANUMATH PRASAD

సింధు ఒప్పందంపై భారత్ కు అంతర్జాతీయ కోర్టు షాక్-తోసిపుచ్చిన కేంద్రం..!

M HANUMATH PRASAD

నాకు సరైన క్రెడిట్ ఇవ్వలేదు..” కాల్పుల విరమణపై మరోసారి స్పందించిన ట్రంప్

M HANUMATH PRASAD

చావు బతుకుల్లో ఉన్న మా నాన్నను కాపాడండి-ట్రంప్ కు ఇమ్రంఖాన్ కొడుకుల విజ్ఞప్తి

M HANUMATH PRASAD

బంగ్లాదేశ్‌ షేక్‌ హసీనాకు బిగ్‌ షాక్‌

M HANUMATH PRASAD

ఇండియాలో పట్టుబడ్డ బంగ్లాదేశీలను సొంతదేశానికి తరలింపు

M HANUMATH PRASAD