Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్

Borugadda Anil Bail: బోరుగడ్డకు బెయిల్‌

అనంతపురం త్రీటౌన్‌ సీఐ మురళీకృష్ణను బెదిరించిన కేసులో రౌడీషీటర్‌ బోరుగడ్డ అనిల్‌కు బెయిల్‌ మంజూరైంది. ఈ కేసులో విచారణ కోసం అనంతపురం జిల్లా జైలు నుంచి బోరుగడ్డ అనిల్‌ను గురువారం స్పెషల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ (మొబైల్‌ కోర్టు) కోర్టులో హాజరుపరిచారు.

ఇన్‌చార్జి న్యాయాధికారి హారిక రావూరి.. బోరుగడ్డకు బెయిల్‌ మంజూరు చేశారు. పోలీసులు సరైన సాక్ష్యాధారాలు చార్జ్‌షీట్‌లో పొందుపరచలేకపోయారని, కేసు కొట్టివేయాలని అనిల్‌ తరఫు న్యాయవాది నారాయణరెడ్డి డిశ్చార్జి పిటిషన్‌ దాఖలు చేశారు. కేసు విచారణను ఈనెల 28కి వాయిదా వేశారు. ఇదివరకే ఫోర్త్‌టౌన్‌ స్టేషన్‌లో నమోదైన కేసులోనూ బెయిల్‌ రావడంతో అనంతపురంలో నమోదైన రెండు కేసుల్లోనూ బోరుగడ్డకు బెయిల్‌ లభించినట్లయింది.

Related posts

విజయనగరాన్ని సిరాజ్ ఎందుకు ఎంచుకున్నాడంటే?

M HANUMATH PRASAD

కూతురు కొడుకు వారసుడు అవుతాడా ?

M HANUMATH PRASAD

FORMER GOVERNMENT OFFICIALS DHANUNJAYA REDDY AND KRISHNA MOHAN REDDY ARRESTED IN LIQUOR SCAM

M HANUMATH PRASAD

వివాదాల చుట్టూ చెన్నై ఆంధ్రా క్లబ్ ఎన్నికలు

విలేఖరి హత్యకేసులో మాజీ MLA., పాత్ర?

M HANUMATH PRASAD

రఘురామపై టార్చర్ కేసులో కీలక పరిణామం..! సీనియర్ ఐపీఎస్ కు బిగ్ షాక్..!

M HANUMATH PRASAD