సీఎం చంద్రబాబు పై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ టార్గెట్‌గా అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు.
స్కిల్ కేసులో సీఎం చంద్రబాబు 53 రోజులు జైల్లో ఉన్నారని.. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్‌ను టార్గెట్ చేసినట్లు ఆయన ఆరోపించారు. ఈ తరుణంలో ఒక్క రోజైనా అదనంగా మాజీ సీఎం వైఎస్ జగన్‌ను జైల్లో ఉంచాలని సీఎం చంద్రబాబు తొందర పడుతున్నారని ఫైరయ్యారు. రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు.
ఈ క్రమంలో మద్యం కేసు రాజకీయ ప్రేరేపితం అని ఆయన పేర్కొన్నారు. వైఎస్ జగన్ అరెస్టే లక్ష్యంగా లిక్కర్ కేసు నడుపుతున్నారని దుయ్యబట్టారు. లిక్కర్ కేసులో దొంగ సాక్ష్యాలను సేకరిస్తున్నారని విమర్శలు గుప్పించారు. లిక్కర్ కేసుతో జగన్ కు ఏం సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి, మంత్రి అచ్చెన్నాయుడు వీరంతా లిక్కర్ కేసు పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలిపారు.
అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దాలు చెబుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఫైరయ్యారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు అమలు చేస్తారని ఆయన ప్రశ్నించారు. లిక్కర్ కేసులో దొంగ సాక్ష్యాలు సేకరిస్తున్నారన్నారని.. లిక్కర్ కేసుతో జగన్‌కు ఏం సంబంధం అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. సిట్ అధికారులు అరెస్ట్ లు చేస్తూ వారి చేత తప్పుడు సాక్షాలు చెప్పించాలని చూస్తున్నారంటూ పేర్ని నాని మండిపడ్డారు. అయితే జగన్ అంటే ఏంటో ప్రజలకు తెలుసని చెప్పారు.
