నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 85 కాంట్రాక్ట్ క్యారేజీ బస్సులపై కేసులు నమోదు చేసి మూడు లక్షల 70 వేల రూపాయల జరిమానాలను విధించామని ఏలూరు జిల్లా ఉప రవాణా కమిషనర్ షేక్ కరీం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా కమిషనరు ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా కాంట్రాక్ట్ క్యారేజీ బస్సులపై వాహన తనిఖీలు ప్రతివారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం తెల్లవారుజామున ఏలూరు జిల్లాలోని పలు ప్రాంతాలలో వాహన తనిఖీ అధికారులు కాంట్రాక్ట్ క్యారేజీ బస్సులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారులపై విశాఖపట్నం నుంచి విజయవాడ, విజయవాడ నుంచి విశాఖపట్నం మధ్య తిరిగే కాంట్రాక్టు క్యారేజ్ బస్సులను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి పర్మిట్ నిబంధనలను ఉల్లంఘించిన 85 బస్సులపై కేసులు నమోదు చేసి 3.70 లక్షల రూపాయలను అపరాధ రుసుముగా విధించామని జిల్లా ఉపరమణ కమిషనర్ షేక్ కరీం ఒక ప్రకటనలో తెలియజేశారు . ఈ తనిఖీలు కొనసాగుతూనే ఉంటాయని డిటిసి స్పష్టం చేశారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో జంగారెడ్డిగూడెం ఆర్టీవో ఎండి. మదని, వాహన తనిఖీ అధికారులు ఎస్.రంగనాయకులు, జి.ప్రసాదరావు, జి.స్వామి, వై.సురేష్ బాబు, ఎస్.జగదీష్ బాబు, కళ్యాణి, కృష్ణవేణి, పి.నరేంద్ర బాబు, అన్నపూర్ణ, డి.ప్రజ్ఞ తదితరులు పాల్గొన్నారు.
