భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని పాములపల్లి మిషన్ భగీరథ పంప్ హౌస్ కింద పేకాట ఆడుతున్నారు. ఆ పదిమంది పేకాట రాయళ్లను గురువారం అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.వారి వద్ద నుంచి రూ.20వేల,9సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
పేకాట ఆడుతూ పట్టుబడిన వారిలో ఓ పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉండటం గమనార్హం.ఈ సందర్భంగా సీఐ అశోక్ మాట్లాడుతూ మండలంలో పేకాట కోడి పందాలు,పశువుల అక్రమ రవాణా మొదలైన వాటిని సహించేది లేదని తెలిపారు. ఎవరైనా సరే సమాచారం అందించినట్లయితే వారి సమాచారం గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు.ఏదైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన కోరారు.
