Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్

విశాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ స్టేషన్ నుంచి స్పెషల్ ట్రైన్స్..!!

వేసవి సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం చర్లపల్లి, విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది.

ఈప్రత్యేక రైలు వివరాలు ఇలా ఉన్నాయి:

ట్రైన్ నెం. 07441 (చర్లపల్లి – విశాఖపట్నం): ఈ రైలు మే 17, 2025 శనివారం మధ్యాహ్నం 2గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు అంటే 18వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 3గంటల 35 నిమిషాలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

ట్రైన్ నెం. 07442 (విశాఖపట్నం – చర్లపల్లి): తిరుగు ప్రయాణంలో ఈ రైలు మే 18,2025 ఆదివారం రోజున రాత్రి 11 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి 19వ తేదీ సోమవారం ఉదయం 11 గంటల 40 నిమిషాలకు చర్లపల్లికి చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైలు వివరాలు ఇలా ఉన్నాయి:

ఇక ఈ స్పెషల్ ట్రైన్స్ నల్లగొండ, మిరియాలగూడ,నడికుడి,గుంటూరు, విజయవాడ,ఏలూరు,రాజమండ్రి, సామర్లకోట,అన్నవరం, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుందని రైల్వే అధికారులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ ప్రత్యేక సర్వీసుల ద్వారా చర్లపల్లి మరియు విశాఖపట్నం మధ్య ప్రయాణించే వారికి మెరుగైన సౌకర్యం లభించనుంది. వేసవిలో తరచుగా రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఈ ప్రత్యేక రైలు ప్రయాణికులకు ఉపశమనం కలిగించనుంది. ఈ రైళ్లలో 3AC, 3AC (ఎకానమీ) క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టికెట్ల రిజర్వేషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రయాణానికి సిద్ధమవుతున్నవారు త్వరగా టికెట్లు బుక్ చేసుకోవడం మంచిది.

ఈ ప్రత్యేక రైళ్ల సమయం, ఇతరవివరాల కోసం రైల్వే వెబ్‌సైట్ లేదా అధికారిక మొబైల్ యాప్‌లను సంప్రదించవచ్చు. వేసవి రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న ఈ చర్యపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

వలంటీర్లలా చేయలేం!

M HANUMATH PRASAD

బెంగళూరు ఎయిర్ పోర్ట్ పై చంద్రబాబు ప్రశంసలు

M HANUMATH PRASAD

ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ సూటిగా 3 ప్రశ్నలు

M HANUMATH PRASAD

మోడీ ఒక డమ్మీ ప్రధాని.. ట్రంప్ డిఫాక్టో ప్రధాని వ్యవహరిస్తుండు: సీపీఐ నారాయణ విమర్శలు

M HANUMATH PRASAD

వైసీపీకి ఎదురు దెబ్బ.. బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌ జకియా ఖానం

M HANUMATH PRASAD

జగన్ మంచితనం వల్లనే మేము సంకనాకి పోయాము – వైసీపీ మాజీ ఎమ్మెల్యే

M HANUMATH PRASAD