ఇండియా,పాక్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుంది. అయిన కూడా ఈ వివాదం మాత్రం ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా ఉందని చెప్పుకొవచ్చు.
ఇప్పటికే భారత్ ప్రధాని మోదీ.. ఇక మీద పాక్ నుంచి ఏచిన్న దాడి జరిగిన పాక్ పైయుద్దం ప్రకటించి నామరూపాల్లేకుండా చేస్తామన్నారు. పాక్ తమను పదే పదే అణుదాడులతో భయపెట్టాలని చూస్తుందన్నారు.
తమ వద్ద ఉన్న అణుబాంబులు దీపావళి కోసం దాచుకొలేదని మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పరిధి దాటితో పరిస్థితులు ఘోరంగా ఉంటాయని హెచ్చరించారు. ఇప్పటికే ప్రధాని మోదీ.. త్రివిధ దళాలకు ఫ్రీహ్యాండ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇండియా, పాక్ ల మధ్య సీజ్ ఫైర్ వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. పాక్ దేశానికి చెందిన ఒక రెంజర్.. బార్డర్ దాటి మన దేశం భూభాగంలోకి ప్రవేశించాడు. ముహమ్మద్ అల్లాహ్ మన భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించాడు.
వెంటనే అతడ్ని ఇండియన్ ఆర్మీ అరెస్ట్ చేసింది. మరొవైపు గతంలో మన దేశానికి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణమ్ కుమార్ షా.. పాక్ భూభాగంలోకి అనుకొకుండా వెళ్లాడు. దీంతో ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. ఈ క్రమంలో మనం పాక్ రెంజర్ ను, పాక్ మన బీఎస్ఎఫ్ జవాన్ ను వదిలిపెటారు
ముఖ్యంగా దౌత్యంతో ఈ సమస్య పరిష్కారం అయ్యింది. ఈ మేరకు పాక్ ఆర్మీ అధికారులు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, ఈ మార్పిడి దౌత్య సంబంధాలలో సానుకూల మార్పును సూచిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
