ఇండియా పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ పౌరులను మోడీ దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో అక్రమంగా నివసిస్తున్న విదేశీయలను చాలా మందిని పోలీసులు గుర్తించారు.
కాగా తాజాగా అలా అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయుల్లో మొదటి బ్యాచ్‌ను అధికారులు రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌కు తరలించారు. మూడు వ్యానుల్లో పోలీసుల సెక్యురిటీ నడుమ వారిని జోద్ పూర్ తరలించగా అక్కడ నుండి వారిని బంగ్లాదేశ్‌కు తరలించనున్నారు. మరోవైపు బెంగాల్‌లో చాలా మంది బంగ్లాదేశీలు అక్రమంగా తరలివచ్చి నివసిస్తున్నారే ఆరోపణలు కొద్దిరోజులుగా వినిపిస్తున్నాయి. అక్రమంగా తరలివచ్చిన విదేశీయులతో ఎప్పుడు ఎలాంటి ముప్పు పొంచి ఉంటుందో తెలియదని ఆందోళనలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని భారత్ సీరియస్‌గా తీసుకుంది. వారందరినీ గుర్తించి సొంత దేశానికి తరలించే చర్యలు చేపడుతోంది.
