Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్

ఎంపీపీ ఇస్తామంటూ టీడీపీ నేతలు ప్రలోభ పెట్టారు.. వీడియో రిలీజ్ చేసిన ఎంపీటీసీ!

సత్యసాయి జిల్లాలోని రామగిరి ఎంపీపీ ఎన్నికపై మరోసారి ఉత్కంఠత నెలకొంది. రెండు రోజుల క్రితం ముగ్గురు ఎంపీటీసీలు టీడీపీ తీర్థం పుచ్చుకోగా.. వైసీపీలోనే కొనసాగుతా అంటూ తెలుగుదేశం పార్టీ నుంచి పేరూరు-2 ఎంపీటీసీ సభ్యురాలు భారతి వెనక్కి వచ్చారు.

టీడీపీ నేతలు తనను భయపెట్టి బలవంతంగా వెంకటాపురం తీసుకెళ్లారని, ఇతనకు ఇష్టం లేకున్నా పార్టీ కండువా కప్పారని భారతి ఓ వీడియో రిలీజ్ చేశారు. తనకు ఎంపీపీ పదవి ఇస్తామని ఆఫర్‌ చేశారని, తనకు ఎలాంటి పదవీ వద్దని చెప్పినా బలవంతపెట్టారని పేర్కొన్నారు. పదవి కంటే పార్టీ ముఖ్యం అని, వైసీపీలోనే కొనసాగుతా అని భారతి స్పష్టం చేశారు.

మే 19న రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక జరగనుంది. ఎంపీపీ ఉప ఎన్నికను వైసీపీ బహిష్కరించింది. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఓ ప్రకటన చేశారు. అయితే ఎంపీపీ పదవి మహిళా అభ్యర్థికి రిజర్వు కావడంతో.. రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత అభ్యర్థి వేటలో పడ్డారు. ఈ క్రమంలో వైసీపీ తరఫున గెలిచిన పేరూరు-2 ఎంపీటీసీ సభ్యురాలు భారతిని మంగళవారం బలవంతంగా వెంకటాపురం తీసుకెళ్లి.. టీడీపీ కండువా కప్పారు. భారతి టీడీపీలో చేరినట్లు పరిటాల సునీత, ఆమె కుమారుడు శ్రీరామ్‌ ఫొటోలకు పోజులిచ్చారు. సాయంత్రం నుంచి భారతి ఎవరికీ కనిపించకుండా పోవడంతో.. వైసీపీ నేతలే ఆమెను కిడ్నాప్‌ చేశారంటూ టీడీపీ నేతలు దుష్ప్రచారం చేశారు. విషయం తెలిసిన భారతి.. ఆ వార్తలను ఖండించారు. తనను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదని, తాను బంధువుల ఇంట్లో ఉన్నానని వీడియో రిలీజ్ చేశారు.

ఎస్పీ మేడం గారికి నమస్కారం. నా పేరు భారతి, పేరూరు-2 ఎంపీటీసీని. నిన్న టీడీపీ కార్యకర్తలు వచ్చి నన్ను తీసుకెళ్లారు. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌ నాకు టీడీపీ కండువా కప్పారు. నాకు ఎంపీపీ పదవి ఇస్తామని ఆఫర్‌ చేశారు. వైసీపీలో గెలిచిన నాకు.. టీడీపీలో ఎంపీపీ కావడం ఇష్టం లేదు. నేను ఇంటికి వచ్చి ఆలోచన చేశాను. పదవి కంటే పార్టీ ముఖ్యం. నేను వైసీపీలోనే కొనసాగుతా. నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు. మే 19న జరిగే ఎన్నికకు హాజరుకాలేను. 25వ తారీకు వచ్చి మీ డబ్బులు మీకు ఇస్తాను’ అని ఎంపీటీసీ సభ్యురాలు భారతి చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Related posts

మహానాడుకు వెళ్తూ కార్యకర్త కొట్టుకెళ్లి టీ తాగిన లోకేష్.. కార్యకర్త భావోద్వేగం

M HANUMATH PRASAD

హైకోర్టుకు ముగ్గురు జడ్జిలు

M HANUMATH PRASAD

ఇల్లు కడుతున్నవ్​ కదా.. పైసలియ్యి!..ఇంటి నిర్మాణదారుడిని బెదిరించిన వ్యక్తి

M HANUMATH PRASAD

పవన్ కల్యాణ్‌ను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించాలి: దళిత సంఘాలు

M HANUMATH PRASAD

ఇంకేంత వ్యవసాయ భూమి కావాలి సార్

M HANUMATH PRASAD

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో కే ఏ పాల్ కు బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ హై కోర్టు