Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
జాతీయ వార్తలు

పేలిన సెల్ ఫోన్.. 14 ఏళ్ళ బాలిక మృతి

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక గుండెవిరిగే ఘటన జరిగింది. 9వ తరగతి విద్యార్థిని సెల్ ఫోన్ ఛార్జింగ్‌లో ఉంచుకుని మాట్లాడుతూ ఉండగా, ఫోన్ ఒక్కసారిగా వేడెక్కి పేలిపోయింది.

ఈ పేలుడులో బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
వివరాల ప్రకారం, బాలిక ఫోన్ ఛార్జింగ్‌లో పెట్టి, వారితో మాట్లాడుతోంది. అర్ధనిద్రలో ఉన్న సమయంలో, అలా మాట్లాడుతుండగా సెల్ ఫోన్ వేడెక్కి పేలిపోయింది. ఈ పేలుడుతో బాలిక తీవ్ర గాయాల పాలైంది. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
ఈ ఘటనతో బాలిక కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ పేలిన కారణాలు ఇంకా తెలియలేదు, కానీ బ్యాటరీలో ముప్పు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు మరియు డిపార్ట్‌మెంట్ అనేక కోణాల్లో ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టారు.

Related posts

మోడీ ఆత్మవిశ్వాసం దెబ్బతింది, బీజేపీ ఓటమి తప్పదు.. ”ఓట్ చోరీ” ర్యాలీలో రాహుల్ గాంధీ

M HANUMATH PRASAD

ప్రొఫెషన్ ఏదైనా.. సైడ్ ప్రొఫెషన్ మాత్రం అదే.. పాక్‌కు సమాచారం ఇచ్చిన మరో గుంట నక్క అరెస్ట్..!

M HANUMATH PRASAD

వందేమాతరం పాడనన్న ఏఆర్ రెహమాన్- సమర్ధించిన సింగర్ చిన్మయి, బంగారం హీరోయిన్ మీరా చోప్రా- ప్రియాంక చోప్రాతో పోలుస్తూ!

M HANUMATH PRASAD

రాహుల్ గాంధీ పరి పక్క్వత లేని వ్యక్తి-లక్ష్మణ్ సింగ్

M HANUMATH PRASAD

షాహి జామా మసీదు సర్వే పై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు

M HANUMATH PRASAD

బెంగళూరులో యువతికి షాక్.. క్యాబ్‌ డ్రైవర్ గా బాస్‌ను చూసి నివ్వెరపోయిన ఉద్యోగిని

M HANUMATH PRASAD