జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో చోటుచేసుకున్న ఉగ్రవాదుల దాడి అనంతరం భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం పతాక స్థాయికి చేరుకుంది.
రెండు దేశాలు దాడులు ప్రతిదాడులకు దిగాయి. డ్రోన్లు, మిస్సైళ్లను సంధించుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవడంతో కాల్పుల విరమణకు అంగీకరించాయి.
పహల్గామ్లో చోటు చేసుకున్న మారణహోమానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణం కావడం వాటిపై భారీగా దాడులు చేపట్టింది. 26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులపై వైమానిక దాడులు సాగించింది భారత్. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగంపై పాతుకుపోయిన ఉగ్రవాద సంస్థలను పెకిలించివేసింది.
అంతకుముందు- పాకిస్తాన్‌పై పలు ఆంక్షలను విధించింది. అట్టారీ- వాఘా బోర్డర్‌ను మూసివేసింది. చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్లతో భారత్‌కు వచ్చిన, ఇక్కడ నివసిస్తోన్న పాకిస్తానీయులు కూడా తమ స్వదేశానికి వెళ్లిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దాదాపుగా పాకిస్తానీయులందరూ స్వదేశానికి తిరుగుముఖం పట్టారు.
అత్యవసర వైద్య చికిత్స, వ్యాపార కార్యకలాపాలు, ఇక్కడ నివసిస్తోన్న తమ బంధువులను కలుసుకోవడం, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి కారణాలతో తరచూ పలువురు పాకిస్తానీయులు విదేశాంగ, రక్షణ మంత్రిత్వ శాఖలు జారీ చేసే అధికారిక డాక్యుమెంట్లతో భారత్‌కు వచ్చిన వాళ్లందరూ అట్టారీ బోర్డర్ మీదుగా సరిహద్దులను దాటారు.
ఈ పరిణామాల మధ్య ఇప్పుడు తాజాగా మరో భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయంలో పని చేసే ఉద్యోగి ఒకరు భారత్‌లో విధ్వంసం సృష్టించడానికి వ్యూహాలు పన్నినట్లు తేలింది. హైకమిషన్ కార్యాలయంలో ఉన్నత స్థాయి అధికార హోదాలో కొనసాగుతూనే చట్టవిరుద్ధ, కుట్రపూరక చర్యలకు పాల్పడినట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
దీన్ని సకాలంలో గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. ఇంటెలిజెన్స్ ద్వారా అందిన ఈ సమాచారాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని కోణాల్లోనూ విశ్లేషించింది. పక్కా సమాచారాన్ని రాబట్టుకుంది. ఉగ్రవాద సంస్థలతో ఆ అధికారికి పరోక్ష సంబంధాలు ఉన్నాయని, దేశ భద్రతకు సంబంధించిన కొంత విలువైన సమాచారాన్ని వాళ్లకు చేరవేసినట్లూ నిర్ధారించుకుంది.
దీనితో విదేశాంగ మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. ఆ అధికారిని దేశ బహిష్కరణ చేసింది. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఆదేశించింది. అలా వెళ్లకపోతే చట్టపరంగా చర్యలను తీసుకోవాల్సి ఉంటుందనీ హెచ్చరించింది. ఆ అధికారిని ఎహసాన్-ఉర్-రహీమ్ అలియాస్ డానిష్‌గా గుర్తించింది. ఐఎస్ఐ ఆపరేటివ్‌గా నిర్ధారించింది.
రాయబార కార్యాలయ ఉన్నత ఉద్యోగిగా చలామణి అవుతున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించుకుంది. దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని పాకిస్తానీయులకు చేరవేస్తోన్నాడనే కారణంతో పంజాబ్
పరిణామాల మధ్య ఇప్పుడు తాజాగా మరో భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయంలో పని చేసే ఉద్యోగి ఒకరు భారత్‌లో విధ్వంసం సృష్టించడానికి వ్యూహాలు పన్నినట్లు తేలింది. హైకమిషన్ కార్యాలయంలో ఉన్నత స్థాయి అధికార హోదాలో కొనసాగుతూనే చట్టవిరుద్ధ, కుట్రపూరక చర్యలకు పాల్పడినట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
దీన్ని సకాలంలో గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. ఇంటెలిజెన్స్ ద్వారా అందిన ఈ సమాచారాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని కోణాల్లోనూ విశ్లేషించింది. పక్కా సమాచారాన్ని రాబట్టుకుంది. ఉగ్రవాద సంస్థలతో ఆ అధికారికి పరోక్ష సంబంధాలు ఉన్నాయని, దేశ భద్రతకు సంబంధించిన కొంత విలువైన సమాచారాన్ని వాళ్లకు చేరవేసినట్లూ నిర్ధారించుకుంది.
దీనితో విదేశాంగ మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. ఆ అధికారిని దేశ బహిష్కరణ చేసింది. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఆదేశించింది. అలా వెళ్లకపోతే చట్టపరంగా చర్యలను తీసుకోవాల్సి ఉంటుందనీ హెచ్చరించింది. ఆ అధికారిని ఎహసాన్-ఉర్-రహీమ్ అలియాస్ డానిష్‌గా గుర్తించింది. ఐఎస్ఐ ఆపరేటివ్‌గా నిర్ధారించింది.
రాయబార కార్యాలయ ఉన్నత ఉద్యోగిగా చలామణి అవుతున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించుకుంది. దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని పాకిస్తానీయులకు చేరవేస్తోన్నాడనే కారణంతో పంజాబ్పోలీసులు ఈ నెల 11వ తేదీన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతన్ని విచారించగా.. ఎహసాన్-ఉర్-రహీమ్ పేరు వెలుగులోకి వచ్చింది.