సూర్యాపేట జిల్లాలోని ఓ వ్యక్తి *డబ్బులు సంపాదించడానికి ఏకంగా* డి.ఎస్.పి అవతారానికి తెర లేపాడు. తన మాయ మాటలతో ప్రజల నుండి పెద్ద మొత్తం లొడబ్బులను తీసుకొని, ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి, అడ్డంగా బుక్కైన వైనం సూర్యాపేటలో వెలుగు చూస్తుంది.
వివరాల్లోకి వెళితే, బత్తుల శ్రీనివాసరావు అనే వ్యక్తి సూర్యాపేట నివాసి, ఈజీ మనీ కి అలవాటు పడ్డ ఈ బత్తుల శ్రీనివాసరావు అనే వ్యక్తి , పోలీసు యూనిఫామ్ ని కుట్టించుకున్నాడు, తన పేరుతో నేమ్ బ్యాడ్జ్ చేయించుకున్నాడు, లాఠీ కొనుకున్నాడు, టోపీ కూడా కొనుక్కున్నాడు, అచ్చం పోలీస్ డిఎస్పి లాగే చూడ్డానికి కనిపిస్తున్నాడు, ఈ బత్తుల శ్రీనివాసరావు అనే వ్యక్తి కొన్నిసార్లు యూనిఫాంలోనూ మరికొన్నిసార్లు సివిల్ డ్రస్ లోను, కనిపిస్తూ డీఎస్పీగా చలా మనీ అయ్యేవాడు. చూసేవాళ్ళుకు ఈయన నిజంగానే డిఎస్పి పోలీస్ అని నమ్మించాడు ఆయన మాయమాటల్లో పడి ఆయన చెప్పిన అబద్ధాలు నిజమని నమ్మి ఆయన సివిల్ సప్లైస్ లోను, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని, కొంతమంది ఆటో డ్రైవర్స్ ని మరియు బార్బర్ షాప్ లో ఉన్నటువంటి సిబ్బందిని నమ్మించగలిగాడు, వారు ఇతడు నిజమే చెప్తున్నాడని గ్రహించి ఆయనకు పెద్ద మొత్తం డబ్బులను సమర్పించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ మహిళకు (ఎస్సై) పోలీసు ఉద్యోగము ఇప్పిస్తానని నమ్మించి ఆమె వద్ద నుంచి డబ్బులను పుచ్చుకున్నాడు కొంతమంది యువకులను పోలీసు ఉద్యోగాలు అనే ఆశ చూపి, వారి వద్ద నుంచి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నాడు, మరి కొందరికి పోలీస్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు పడుతున్నాయని నమ్మించి , దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ అంతా తన చేతిలోనే ఉందని నమ్మించి వారి వద్ద నుంచి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నాడు, నమ్మించి మోసం చేసి ప్రజల వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించుకున్నాడు,

కొన్ని ఫేక్ రిజిస్టర్స్ ని కూడా తాను తయారు చేశాడు పోలీస్ స్టేషన్లో ఉంటున్నటువంటి స్టాఫ్ రిజిస్టర్స్ కానీ , కేసులకు సంబంధించిన ఇతర రిజిస్టర్స్ కానీ అచ్చ ఒరిజినల్ రిజిస్టర్స్ మాదిరిగానే, డూప్లికేటర్ రిజిస్టర్ ని తాను సృష్టించి, వ్యక్తులకు చూపించి, నమ్మించా డు. ఈ బత్తుల శ్రీనివాసరావు అనే వ్యక్తికి పాత నేర చరిత్ర ఉంది, 2024లో 6 పోలీస్ స్టేషన్లో తనమీద వివిధ కేసులు నమోదైనట్టు వివరాలు ఉన్నాయి, 2022 లో కూడా తన పై కేసులు ఉన్నాయని ఇన్స్పెక్టర్ రాఘవులు గారు తెలిపారు. సూర్యాపేట వన్టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు చాకచక్యంగా ఈ వ్యక్తిని పట్టుకోగలిగారు, ప్రస్తుతం అరెస్టు అయిన భత్తుల శ్రీనివాసరావు అనే వ్యక్తి దగ్గర నుంచి 18 లక్షలు రూపాయలను రికవర్ చేయగలిగారు. మిగతా డబ్బులను తాను వాయిదాల పద్ధతిలో చెల్లిస్తానని ఒప్పుకున్నాడు, ఈ వ్యక్తిని పట్టుకునే టాస్క్ లో, చాకచక్యంగా బహు కీలక పాత్ర వహించినటువంటి సూర్యాపేట టౌన్ ఇన్స్పెక్టర్ రాఘవులు గారు, మరియు అతనికి సహకరించినటువంటి ఎస్ఐ సైదులు గారు, క్రైమ్ స్టాఫ్ కు సంబంధించినటువంటి విద్యాసాగర్ గారు, కృష్ణ గారు , కరుణాకర్ గారు, మధుగారు, మరియు SPDO ( సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీస్ ) నుండి ఇతర స్టాఫ్ సిబ్బంది సహకారంతో ఈ వ్యక్తిని పట్టుకోగలిగారు. ఈ టాస్క్ లో సహకరించిన వారందరికీ తగిన రివార్డును అందజేస్తామని ఇన్స్పెక్టర్ రాఘవులు గారు తెలిపారు. బత్తుల శ్రీనివాసరావు పై కేసు నమోదు చేసి, అతనిని కోర్ట్ లో హాజరుపరచనున్నారు,
ఇందుమూలముగా , సూర్యాపేట టౌన్ ఇన్స్పెక్టర్ రాఘవులు గారు మాట్లాడుతూ, ఎవరైనా మీకు ఉద్యోగం ఇస్తామని డబ్బులు అడిగితే నమ్మవద్దని ప్రజలకు తెలిపారు,
