Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్

వల్లభనేని వంశీకి బెయిల్

వై ఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు అయింది. విజయవాడలోని ఎస్సీ/ఎస్టీ కోర్టు మంగళవారం వంశీకి బెయిల్ మంజూరు చేసింది.

సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీకి బెయిల్ దక్కింది. వంశీతో పాటు మరో నలుగురికి ఈ కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. వల్లభనేని వంశీని 2023లో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఫిబ్రవరి 13, 2025న హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సాక్షిగా ఉన్న ముదునూరి సత్యవర్ధన్ అనే వ్యక్తిని వల్లభనేని వంశీ బెదిరించి, కిడ్నాప్ చేసి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయించాడని ఆరోపణలు వచ్చాయి. సత్యవర్ధన్ మొదట కోర్టులో తనకు ఈ కేసుతో సంబంధం లేదని చెప్పాడు.

అయితే, తర్వాత పోలీసులను ఆశ్రయించి వల్లభనేని వంశీ తనను కిడ్నాప్ చేసి బెదిరించాడని ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా వల్లభనేని వంశీపై కిడ్నాప్, బెదిరింపు, ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే టీడీపీ ఆఫీస్‌పై దాడి చేసిన కేసులో వంశీకి బెయిల్ వచ్చింది.గన్నవరం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. తాజాగా కిడ్నాప్ కేసులో కూడా ఆయనకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 13న వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు మూడు నెలల తర్వాత ఆయన బెయిల్‌పై బయటకు రానున్నారు.

Related posts

ఎట్టకేలకు కాకాణి అరెస్ట్..

M HANUMATH PRASAD

వైసీపీకి ఎదురు దెబ్బ.. బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌ జకియా ఖానం

M HANUMATH PRASAD

చంద్రబాబు, రేవంత్‌ ఇద్దరూ దోషులే.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు రద్దు చేయాలి: సీజేఐకి మత్తయ్య లేఖ

M HANUMATH PRASAD

మాచర్ల మున్సిపల్‌ చైర్మన్‌కు షాకిచ్చిన సర్కార్‌.. పదవి నుండి తొలగింపు..

M HANUMATH PRASAD

మంగుళూరులో హిందూ కార్యకర్త దారుణ హత్య

చంద్రబాబుపై పాత కేసులన్నీ వెనక్కి? బెయిల్ రద్దు కోరబోతున్న వైసీపీ ..!

M HANUMATH PRASAD