Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
జాతీయ వార్తలు

బాబోయ్ పులి తినేసింది

అడవిలో బీడీ ఆకులు సేకరించడానికి వెళ్లిన ఓ మహిళలపై పులి దాడి చేసింది. అనంతరం ఆమె మెడ పట్టుకుని కిలోమీటర్‌ దూరం పాటు ఈడ్చుకెల్లి ఆమెను తినేసింది.

ఈషాకింగ్‌ ఘటన మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో శనివారం (మే 10) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సియోని జిల్లాలోని బిచౌమల్‌ గ్రామానికి చెందిన హేమలతా దహర్వాల్‌ (50) అనే మహిళ శనివారం అడవిలో టెండూ ఆకులు (బీడీ తయారుచేసేందుకు ఉపయోగించే ఆకులు) సేకరించడానికి ఒంటరిగా వెళ్లింది. ఆకులు సేకరిస్తున్న సమయంలో ఆమెపై పెద్దపులి దాడి చేసింది. దీంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం పలు ఆమె మెడను నోట్లో కరుచుకుని సుమారు 1.5 కిలోమీటర్ల దూరం అడవిలోపలికి లాక్కెల్లింది. అనంతరం ఆమెను తినడం మొదలు పెట్టింది

అడవిలోకి వెళ్లిన ఆమె తిరిగిరాకపోవడం, అడవిలో భయంకర అరుపులు విన్న స్థానికులు 50 మందికిపైగా అడవిలో గాలింపు చేపట్టగా.. ఓ చోట మహిళ మృతదేహం దారుణ స్థితిలో లభించింది. వారి అరుపులు విన్న పులి.. మృతదేహాన్ని అక్కడ వదిలేసి భయంతో అక్కడి నుంచి పారిపోయింది. మహిళ మెడ చుట్టూ, శరీరంలోని ఇతర భాగాల్లో పులి గోళ్లు, దంతాల గుర్తులు కనిపించాయి. దీంతో ఆగ్రహానికి గురైన గ్రామస్థులు మృతదేహంతో ఖవాసా అటవీ కార్యాలయం ముందు ఐదు గంటలపాటు ధర్నాకు దిగారు. బాధిత కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అయితే నిబంధనల ప్రకారం రూ.8 లక్షలు ఇస్తామని అధికారులు స్పష్టం చేప్పడంతో దర్నా విరమించారు. పులి కోసం అడవిలో గాలిస్తున్నామని సియోని జిల్లా అటవీ అధికారి గౌరవ్ మిశ్రా తెలిపారు.

పెంచ్ టైగర్ రిజర్వ్ డిప్యూటీ డైరెక్టర్ రజనేష్ సింగ్ మాట్లాడుతూ.. మహిళను చంపిన పులిని కనుగొనడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. దాడికి పాల్పడిన పులికి నాలుగు నుంచి ఐదు సంవత్సరాల వయస్సు ఉంటుందని అన్నారు. పులి అకస్మాత్తుగా దాడి చేసిన మహిళను తీవ్రంగా గాయపరిచి హత మార్చింది. మేము పులిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ అంతకంటే ముందుగా దాని దూకుడు వెనుక ఉన్న కారణాన్ని మనం గుర్తించాలి. సాధారణంగా పెద్ద లేదా గాయపడిన పులులు సులభంగా ఆహారం కోసం వెతుకుతాయి. కొన్నిసార్లు నిరాశతో మనుషులపై దాడి చేస్తాయని ఆయన అన్నారు.

Related posts

ఛీ.. ఛీ.. నడి రోడ్డు మీద యువతి పెదాలపై ముద్దులు.. వెలుగులోకి కామాంధుడి పైత్యం.. వీడియో వైరల్..

M HANUMATH PRASAD

బక్రీద్ వేళ జంతు వధ వద్దు.. ముస్లింలకు హిందూ మత సంస్థ అపీల్

M HANUMATH PRASAD

కోల్‌కతాలో 150 మంది మాజీ టీచర్ల అరెస్ట్‌

M HANUMATH PRASAD

అవివాహితులైతే ఒప్పు.. వివాహితులైతే తప్పు

M HANUMATH PRASAD

రాహుల్ కు ఈసీ స్వీట్ వార్నింగ్

M HANUMATH PRASAD

జస్టిస్‌ బేలాకు దక్కని ‘వీడ్కోలు’!.. సీజేఐ గవాయ్‌ అసంతృప్తి

M HANUMATH PRASAD