Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
తెలంగాణ

డిల్లీ తెలంగాణ భవన్లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటుకు ఆమోదం

  • ఢిల్లీలో పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ ఆమోదం తెలిపింది. ఎన్డీఎంసీ ప్రతిపాదన మేరకు తెలంగాణ భవన్‌లోని విగ్రహ ఏర్పాటు ప్రతిపాదిత స్థలంలో తగు ఏర్పాట్లకు ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ పలు సూచనలు చేసింది.

దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు (PV Narasimha Rao) విగ్రహాన్ని (Statue) ఢిల్లీ (Delhi)లో ఏర్పాటు చేయనున్నారు. పీవీ విగ్రహ ఏర్పాటు ప్రతిపాదనకు ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ (Delhi Urban Art Commission) కీలక ఆమోదం తెలిపింది. ఇక కేంద్రం నిర్ణయమే తరువాయిగా మారింది. తెలంగాణ భవన్‌ (Telangana Bhavan)లో పీవీ విగ్రహం ఏర్పాటుకు న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (New Delhi Municipal Corporation) ప్రతిపాదన చేసింది. ఇటీవల జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ ఆమోదం తెలిపింది. ఎన్డీఎంసీ ప్రతిపాదన మేరకు తెలంగాణ భవన్‌లోని విగ్రహ ఏర్పాటు ప్రతిపాదిత స్థలంలో తగు ఏర్పాట్లకు ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ పలు సూచనలు చేసింది.

ఢిల్లీలో నూతన తెలంగాణ భవన్ నిర్మించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణ భవన్ ఆంధ్ర భవన్‌తో కలిసి ఉన్నందున ఇక్కడ ఏర్పాటు సాధ్యం కాదని తెలంగాణ భవన్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర భవన్‌లో ఉన్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు విగ్రహానికి సమీపంలో పీవీ విగ్రహం ఏర్పాటు చేయాలని ఎన్‌డిఎంసినీ పీవీ నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ కోరింది. ప్రతిపాదనను ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ పంపించడంతో కమిషన్ ఆమోదం తెలిపింది. ఢిల్లీలో పీవీ స్మారకం ఏర్పాటుతో పాటు ఆయనకు ఎన్డీఏ ప్రభుత్వం భారతరత్న ఇచ్చి గౌరవించింది.

పీవీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ముఖ్యమైన ప్రముఖులు ప్రధాని మోదీ, లేదా ఇతర ప్రముఖులు ఈ ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పీవీని కాంగ్రెస్ నేతలు అవమానించారు. పీవీ విగ్రాహాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూడా పెట్టనివ్వలేదు. పీవీ అంత్యక్రియలు కూడా ఢిల్లీలో జరగకుండా హైదరాబాద్‌లో జరిగాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం పీవీకి మర్యాద ఇచ్చింది. భారతరత్న ఇచ్చి గౌరవించింది. ఇప్పుడు ఢిల్లీలో పీవీకి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత కూడా ఎన్డీయేకే దక్కుతుంది.

Related posts

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నాగార్జున దంపతులు.. అఖిల్ పెళ్లికి ఆహ్వానం..!

M HANUMATH PRASAD

హైదరాబాద్ లో బాణసంచా కాల్చడంపై నిషేధం – సీపీ సివి ఆనంద్

M HANUMATH PRASAD

వాళ్ళు తరగతులు నిర్వహించుకుంటే మీకెందుకయ్య బాధ-పిటిషనర్ పై హైకోర్టు ఆగ్రహం

M HANUMATH PRASAD

KCR ఫ్యామిలీలో అసలేం జరుగుతోంది.. కవిత కోపానికి కారణాలివేనా.!!

M HANUMATH PRASAD

హైదరాబాద్‌లో పాక్ ఉగ్రవాదులు? వీడియో వైరల్

M HANUMATH PRASAD

జెంటిల్ మాన్ కు ప్రతిరూపం దత్తాత్రేయ గారు -ఏపీ సీఎం చంద్రబాబు

M HANUMATH PRASAD