హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పాటైన హైడ్రా పోలీస్ స్టేషన్ అక్రమ నిర్మాణాలు, భూకబ్జాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ హైడ్రా పోలీస్ స్టేషన్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు.
హైదరాబాద్ నగరంలో కొత్తగా ఏర్పాటైన హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. అక్రమ నిర్మాణాలు, భూకబ్జాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కఠినంగా వ్యవహరించేందుకు ఈ ప్రత్యేక విభాగాన్ని సిద్ధం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిని అధికారికంగా ప్రారంభించనున్నారు.
ప్రత్యేకంగా నియామకాలు, నిపుణుల బృందంతో ఇతర పోలీస్ స్టేషన్లకు అతీతంగా పనిచేసే ఈ ప్రత్యేక శాఖలో ఒక ఏసీపీ, ఆరు ఇన్‌స్పెక్టర్లు, పన్నెండు ఎస్‌ఐలు, ముప్పై మంది కానిస్టేబుళ్లను నియమించారు. ఇందులో వనరుల వినియోగాన్ని మరింత పెంచేందుకు సుమారు 70కి పైగా వాహనాలు, అందులో 40 స్కార్పియోలు, 20 డీసీఎంలు, బైక్స్, టిప్పర్లు తదితర రకాల వాహనాలను హైడ్రా తన సేవలోకి తీసుకుంది.
ఈ వాహనాలను ముఖ్యమంత్రి చేతుల మీదుగా స్టేషన్‌కు అప్పగించనున్నారు.
భూములను అక్రమంగా కబ్జా చేసే వారిపై కఠిన చర్యలు ఉండనున్నాయి.
చెరువుల్లో మట్టిపోసి భూమిని ఆక్రమించడం, నాలాలు మూసేయడం, తప్పుడు పత్రాలతో ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవడం, రోడ్లపై నిర్మాణాలు అక్రమ నిర్మాణాలు వంటి చర్యలపై నేరుగా కూల్చివేతలు చేపడతామని స్పష్టం చేశారు.
ఇప్పుడు ప్రత్యేక పోలీస్ స్టేషన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో, ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో, ప్రజలకు న్యాయం అందిస్తుందో లేక పేద ప్రేజల్లో భయాన్నే మిగులుస్తుందో అన్నది సమయం చెప్పాలి. ఈ విషయం మీద స్థానిక ప్రజలు హర్షం వ్యక్త పరుస్తుంటే అక్రమార్కుల గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయనడంలో సందేహం లేదు
