Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
అంతర్జాతీయం

పాకిస్తాన్ కాల్పులలో విధులు నిర్వహిస్తూ మురళీనాయక్ మృతి-

హైదరాబాద్:మే 09
భారత్, పాక్ దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగు తోంది. దేశ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ సైన్యం దాడులకు పాల్పడుతుం డగా.. భారత సైన్యం దీటు గా తిప్పికొడుతోంది. ఈ క్రమంలో జమ్మూకాశ్మీర్‌లో పాక్ జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ వీర మరణం పొందారు.

మృతి చెందిన జవాన్‌ను మురళీనాయక్‌గా గుర్తిం చారు. ఇతడి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన కల్లి తండా. రేపు స్వగ్రామానికి వీర జవాన్ పార్థివ దేహం రానున్నట్లు సమాచారం.

తల్లిదండ్రులకు మురళి నాయక్,ఏకైక సంతానం. ఇక సోమందేపల్లిలోని విజ్ఞాన్ స్కూల్‌ విద్యా వ్యాసం చేసిన వీర జవాన్.. 2022లో ఇండియన్‌ ఆర్మీలో చేరాడు.

నాసిక్‌లో శిక్షణ పొంది, జమ్మూ కాశ్మీర్‌లో విధులు నిర్వహించి తిరిగి పంజాబ్‌ కు ట్రాన్స్ఫర్ అయ్యాడు. పంజాబ్‌లో పనిచేస్తుం డగా.. భారత్-పాక్‌ ఉద్రిక్త తల నేపథ్యంలో రెండు రోజుల క్రితం పంజాబ్ నుంచి జమ్మూకు విధుల నిమిత్తం వెళ్లాడు. అక్కడ పాక్‌ కాల్పుల్లో వీరమరణం పొందాడు…..

Related posts

సింధు ఒప్పందంపై భారత్ కు అంతర్జాతీయ కోర్టు షాక్-తోసిపుచ్చిన కేంద్రం..!

M HANUMATH PRASAD

4 నుంచి హజ్‌ యాత్ర.. ప్రకటించిన సౌదీ అరేబియా

M HANUMATH PRASAD

ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరుల అరెస్ట్‌

M HANUMATH PRASAD

బాల్య వివాహ నిషేధ చట్టం తెచ్చిన పాక్‌

M HANUMATH PRASAD

37 వేల మంది పౌరసత్వం రద్దు–కువైట్‌ ప్రభుత్వం నిర్ణయం

M HANUMATH PRASAD

షాకింగ్ ఘటన.. పెంపుడు సింహం చేతిలో దారుణ హత్యకు గురైన వ్యక్తి!

M HANUMATH PRASAD