కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి అనే సభ్యుడు తన ఆవేదన ను బహిరంగ లేఖ ద్వారా క్లబ్ సభ్యుల కు నివేధించినది ఏమనగా ..
“నేను గతంలో అసోసియేషన్ తీసుకొన్న నిర్ణయం ప్రకారం చిల్డ్రన్ కోట వారసత్వ గా క్లబ్ మేనేజ్మెంట్ కట్టమన్న డబ్బు కట్టి మా కున్న అర్హత ను బట్టి మేము సభ్యత్వం తీసుకోవటం జరిగింది. మా సభ్యత్వం పై అనుమానలు ఉన్న కొంత మంది సభ్యులు మేము అసోసియేషన్ నిర్ణయం ప్రకారం డబ్బు చైల్లించిన తరువాత కోర్ట్ ను కొంతమంది సభ్యులు ఆశ్రయించారు, ఈ విషయం ప్రస్తుతం కోర్ట్ లో పెండింగ్ లో ఉండగా ఇప్పుడు క్లబ్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, క్లబ్ కట్టమన్న 89 మందిలో మేము 33 మంది మాత్రమే సభ్యత్వం తీసుకొన్నము. మేము కట్టిన డబ్బుకు రసీదు మరియు మాకు మెంబర్షిప్ కార్డ్ జారీ చేయటం జరిగింది ,కానీ సుప్రీం కోర్టు లో మా నియామకం చైల్లు బాటు కాదని ,ఈ చిల్డ్రన్ కోట విషయం తప్ప జరిగిందని శేషాద్రి అనే సభ్యుడు కోర్ట్స్ ను ఆశ్రయించారు, ప్రస్తుతం ఆ వివాదం కోర్ట్ లో ఉండగా ,మీరు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది ,డబ్బు కట్టిన మేము అసోసియేషన్ ఆఫీసులో సంప్రదించగా, మాకు ఓటు హక్కు కానీ, ఎలక్షన్ లో నిలబడె అవకాశం కానీ లేదని తెలిపారు, అది విన్న మేము షాక్ కు గురిఅయ్యి విచారించగా,అసోసియేషన్ అధ్యక్షుడు సుప్రీం కోర్టులో ఇటీవల ఇంప్లీడ్ పిటిషన్ వేసి ప్రేయర్ లో 89 మందిని తప్పించి ఎలక్షన్ జరపుటకు అవకాశం ఇవ్వమని అడగటం జరిగింది ,అదే విధంగా కోర్ట్ కు 6 సంవత్సరల అకౌంట్ క్లియర్ చేసుకొనే అవకాశం ఇవ్వమని కోరడం జరిగిందని మాకు తెలిసింది , ఒకసారి మా విధానం పై కోర్ట్ కి శేషాద్రి వెళ్లగా ,,మీరు మమ్మల్ని తొలగించి ఎలక్షన్ జరిపించమని కోర్ట్ ను ఎలా కోరరు.. కానీ కోర్ట్ తీర్పు రాక ముందే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చి 18 మే ఎలక్షన్స్ అని నోటీస్ బోర్డులో వేయడం ,కోర్ట్ లో తీర్పు ఏమి వస్తుందో తెలియకుండా ,మీరీ నిర్ణయం తీసుకోవడం పైగా మీ అభ్యర్థన లో మమ్మల్ని తొలగించి ఎలక్షన్ జరపమని అడగటం కోర్ట్ ను ధిక్కరించినట్లు కదా ? అలా కోర్ట్ ను మీరు ధిక్కరించై ప్రయత్నం చేస్తే ,అసోసియేషన్ కట్టమన్న డబ్బు కట్టిన మాకు ,ఎలక్షన్ లో పోటీకి .ఓటు వేయుటకు మాకు అవకాశం కల్పించకుండ ఎలక్షన్ జరపడం చట్ట రీత్యా నేరం కావున మీరు కోర్ట్ జడ్జిమెంట్ వచ్చే వరకు ఆగాలి.లేద మాకు ఓటు హక్కు కల్పించాలి ,గత 6 సంవత్సరలు గా ఎన్నికలు జరపని మీరు ఇప్పుడు ఎందుకు హుటాహుటిన ఎలక్షన్ జరపలనుకోవటం ఏమిటో ఎవ్వరికి అర్ధం కావటం లేదు ,ఇలా ఎలక్షన్ జరపాలి అనీ మీకు అనిపించిఉంటే అందరిని సమావేశ పరిచి అప్పుడే నిర్ణయం తీసుకొని ఉంటే సంస్థ గౌరవం పెరిగేది ,ఇక నేనైన నయాకోవిధుల సలహా పాటించి ..ఎలక్షన్ ను నిలిపివేసి కోర్ట్ ఉతృర్వులు వచ్చు వరకు ఆగలని కోరుకొంటున్నాము……..ఒకవేళ కోర్ట్ తీర్పు మాకు అనుకూలంగా వస్తే…అప్పుడు మీరు ఇప్పుడు ఎలక్షన్ జరిపితే మాకు అన్నాయం జరిగినట్లు కధా….ఇదివరలో 2019 లో జరిగిన ఎన్నికల బాలట్ ను ఒక గదిలో నిషిద్ధ మై ఉన్నవాటిని .ప్రస్తుతం కోర్ట్ తీర్పు లో 2019 లో జరిగిన ఎలక్షన్ ను పరిగణనలోకి తీసుకొని ఆ రిజర్వ్ చేసిన బాక్స్ లను లేక్క పెడితే ,ఇప్పుడు మీరు జరిపే ఎన్నికలు దానికి అయ్యే ఖర్చు,కాంటెస్ట్ చేసిన వారు లక్షలు ఖర్చు పెట్టి జనం ను ఆంధ్ర, తెలంగాణ నుంచి తీసుకుని రావటం ఇవ్వన్ని మెంబర్లకు నష్టం కధా అన్న విషయం గురించి మీరు ఆలోచించారా ? భారత దేశం ప్రస్తుతం యుద్ధ వాతావరణం లో ఉండగ ,అది కాక చెన్నై ను జోన్ ఒకటిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం మీకు గుర్తుకు రాలేద.. ఇలాంటి దేశం ఉన్న కిష్ట పరిస్థితులలో ఆంధ్ర క్లబ్ ఎన్నికలు జరపటం చాలా అవసరమా.. సడన్ గా ఢిల్లీలో ఉన్న సుప్రీం కోర్టు లో ఈ కేస్ మే 14 ఉంటుంది అప్పుడు ఇదేవిధంగా రీచ్ కాక పోతే ఏమి చేస్తారు.. మే 23 నుంచి సుప్రీం కోర్టు కు వేసవి హాలిడేస్ , ఈ లోగా ఢిల్లీ రాజధాని లో టెన్షన్ మొదలు అయితే చేయ గలిగింది ఏమి లేదు ,కేసు లు వేసిన అందరిని, పోటీచేసిన అందరిని,ఒక చోట చేర్చి పరిస్థితులను వివరించి అందరు కలిసి విత్ డ్రా పిటీషన్ వేస్తే మేటర్ క్లోజ్ అవ్వుతుందని నా విన్నపం,వెంటనే ఎన్నికల ను నిలిపి మాకు నాయమైన మార్గం లో పోటీ చేయుటకు ,ఓటు హక్కును వినియోగించుటకు అవకాశం ఇవ్వాలని మా 33 మంది తరపున మనేజ్మెంట్ ని కోరుకొంటూన్నం
