Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
తెలంగాణ

రైట్, రైట్ – RTC సమ్మెకు తాత్కాలిక బ్రేక్

ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం.
అవ్వడంతో సమ్మె వాయిదా పడింది. ఉద్యోగుల సమ స్యలపై ముగ్గురు ఐఏఎస్ అధికారుల కమిటీని ఏర్పాటు చేశారు.
నవీన్ మిత్తల్, లోకేష్ కుమార్, కృష్ణభాస్కర్‌తో కమిటీ ఏర్పాటు చేస్తూ జీవో విడుదల చేశారు.

ఉద్యోగ సంఘాలతో చర్చించి సమస్యల పరి ష్కారం సూచించనుంది.
వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
సమ్మె కొంతకాలం వాయిదా వేయాలని నిర్ణయించామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీ సమ్మెను వాయిదా వేస్తున్నామని, సమస్యలు పరిష్కరించకపోతే మళ్లీ సమ్మెకు దిగుతామని వెల్లడించింది.

ఉద్యోగ భద్రత కల్పించా లని ప్రభుత్వాన్ని కోరామని, ప్రైవేటు విద్యుత్‌ బస్సుల గురించి ప్రభుత్వం సాను కూలంగా స్పందించిందని, ప్రభుత్వమే విద్యుత్‌ బస్సు లు కొని ఆర్టీసీకి ఇచ్చేలా చర్యలు చేపడతామని అన్నారు.

కారుణ్య నియామకాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిం దని, సింగరేణి మాదిరిగా రెగ్యులర్‌ ప్రాతిపదికన కారుణ్య నియామకాలు చేపట్టాలని చెప్పామని, విశ్రాంత ఉద్యో గుల బకాయిలపై సాను కూలంగా స్పందించారని తెలిపారు.

వేతన సవరణ గురించి సానుకూలంగా స్పందించా రని, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై సుదీర్ఘంగా చర్చించామని అన్నారు.
సమ్మె కొంతకాలం వాయిదా వేయాలని నిర్ణయించాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీ సమ్మెను వాయిదా వేస్తున్నాం.
సమస్యలు పరిష్కరించకపోతే మళ్లీ సమ్మెకు దిగుతాం.
ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరాం.

ప్రైవేటు విద్యుత్‌ బస్సుల గురించి ప్రభుత్వం సాను కూలంగా స్పందించింది.
ప్రభుత్వమే విద్యుత్‌ బస్సులు కొని ఆర్టీసీకి ఇచ్చేలా చర్యలు చేపడతామన్నారు.
వేతన సవరణ గురించి సాను కూలంగా స్పందించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై సుదీర్ఘంగా చర్చించాం.

తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేయాలని ఇటీవల టీజీఎస్‌ఆర్టీసీ ఐకాస నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి వరకు చర్చలకు ఆహ్వానం రాకపోతే మే 7వ తేదీ నుం చి సమ్మెకు దిగుతామని ప్రకటించారు.

ఈ క్రమంలోనే సోమవారం భారీ కవాతు సైతం నిర్వ హించారు. ఆర్టీసీ కార్మిక సమస్యల పరిష్కారం కోసం మే 7న తెల్లవారుజాము నుంచి సమ్మెకు పిలుపు నిచ్చినట్లు ఐకాస చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ ఛైర్మన్ ఎం.థామస్ వెల్లడించారు..

Related posts

హైదరాబాద్‌లో భారీ పేలుళ్ల కుట్ర భగ్నం..

M HANUMATH PRASAD

జెంటిల్ మాన్ కు ప్రతిరూపం దత్తాత్రేయ గారు -ఏపీ సీఎం చంద్రబాబు

M HANUMATH PRASAD

అగ్నిప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా

M HANUMATH PRASAD

లేఖ పై తొలిసారి స్పందించిన కవిత.. కెసిఆర్ పై సంచలన వ్యాఖ్యలు

M HANUMATH PRASAD

బక్రీద్ పండుగను ఎలాగైనా జరుపుకోండి… గోవధ జరిగితే ఊరుకునేది లేదు… : రాజా సింగ్ హెచ్చరిక…

M HANUMATH PRASAD

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్..

M HANUMATH PRASAD