Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్

వివాదాల చుట్టూ చెన్నై ఆంధ్రా క్లబ్ ఎన్నికలు

చెన్నైలో తెలుగువారికి ఒక వేదిక అయినటు వంటి ఆంధ్ర సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ (ఆంధ్ర క్లబ్ ) గత 6 సంవత్సరలుగా ఎన్నో వివాదాల తో తెలుగు వారి ప్రతిష్టను దిగదార్చుచున్నది , 1952 లో స్థాపించిన ఈ సంస్థ ప్రస్తుతం కులమతాల కొట్లాటల మధ్య నలిగిపోతున్నాది. చలనచిత్ర పరిశ్రమ చెన్నైలో ఉన్నప్పుడు ప్రముఖ నటులకు ఇది కేంద్రంగా నడిచినది. దీనిలో తెలుగు సభ్యుల తో పాటు తమిళులు కూడా సభ్యులు గా ఉంటారు కానీ వారికి మాత్రం ఓటు హక్కు ఉండదు, గతంలో ఉన్న మేనేజింగ్ కమిటీ బైలా ను ఆతిక్రమించి కొంత మంది సభ్యులను పిల్లల కోటా మరియు అల్లుళ్ళ కోటాలో తప్పుగా సభ్యులుగా ప్రవేశం కల్పించారని వారికి, వారిని రేకమెండ్ చేసినది తల్లిదండ్రులేనా అనే వివాదం సభ్యుల నుంచి మొదలు అయ్యిన కధ చివరికి సుప్రీంకోర్టు వరకు వెళ్ళినది, అక్రమమార్గంలొ మెంబెర్స్ గా ప్రవేశం పొందిన వారు, గతంలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలొ వారి నుండి కొంత మేర డబ్బు కట్టించుకొని వారికి ప్రవేశం కల్పించాలని తీర్మానం చేస్తే అందులో 36 మంది వరకు డబ్బు కట్టి సభ్యత్వాన్ని తీసుకొన్నారు. అప్పుడు 2019లో ఎలక్షన్ జరుపుటకు మద్రాస్ హైకోర్టు ఒక రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఎన్నికలు జరుపగా ఈ చిల్డ్రన్ కోటాకు సంబంధించిన వారికి ప్రత్యేక పోలింగ్ ను ఏర్పాటు చేశారు, ఎలక్షన్ జరిగింది కానీ ఫలితాలు మాత్రం ప్రకటించలేదు, కోర్ట్ ఆర్డర్ లో ఫలితాలు ప్రకటించమన లేదు కాబట్టి వాటిని ఒక స్ట్రాంగ్ రూమ్ లో పెట్టి లాక్ చేసి జడ్జి కమిషనర్ తరలివెళ్లారు. ఇది జరిగిన తరువాత శేషాద్రి అనే సభ్యుడు హైకోర్టు ఆర్డర్ సరిగా లేదు, క్లబ్ లో ఈ చిల్డ్రన్ కోటా విషయం లో కొంత మొత్తం అవినీతి జరిగిందని, ఈ ఎన్నికల విధానం లో చాలా అవకతవకలు జరిగాయి అని సుప్రీం కోర్టు ను ఆశ్రయించి అవకతవకలకుపాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయస్ధానాన్నికోరారు. ప్రతివాదులుగా ఆంధ్ర క్లబ్ తో పాటు మరో 26 మందిని చేర్చారు. ఈ కేస్ దాదాపుగా 6 సంవత్సరాలుగా సుప్రీంకోర్టు లో పెండింగ్ లో ఉంది. ఈ కేస్ కు ఆంధ్ర క్లబ్ తరపున సుప్రీంకోర్టు లో సంతకాలు చేసే అధికారం కార్యదర్శిగా ఉన్న చక్రవర్తి గారికి మాత్రమే ఉండగా, మధ్యలో అసోసియేషన్ ఆక్టివిటీస్ లో ఆయన సరిగా పాల్గొనటం లేదని వారిని తొలగించి కమిటీ అధ్యక్షుడు సుబ్బారెడ్డి కి ఆ అధికారం కట్టబెట్టారు. ఈ విషయమై చక్రవర్తి అడ్డుకోగానే, సుబ్బారెడ్డి ఇంప్లీడ్ పిటీషన్ కోర్ట్ లో పరిగణ లోకి తీసుకోలేదు, గెలిచిన కమిటీ మెంబెర్స్ కూడా ఎవ్వరూ క్లబ్ కు రాకపోయిననూ కార్యదర్శి ఒక అడ్హక్ కమిటీని నియమించారు.

ఆ తరువాత సెక్రటరీ వేసిన అడ్హక్ కమిటీని ప్రెసిడెంట్ రద్దు చేసి తనకు సంబందించిన వారితో పాటు గతంలో ఉన్న కొంతమంది కమిటీ సభ్యులను కూడా నియమించారు. అసోసియేషన్ ట్రెజరర్, కల్చరల్ సెక్రటరీ లతో పాటు కొంతమంది కమిటీ సభ్యులు ఇలాంటి గొడవల నేపథ్యంలో వారు తమ పదవులకు రాజీనామా చేశారు , అలాగే కార్యదర్శిని కూడా మూడు మీటింగ్ లకు రాలేదని తీసివేశారు. ఈ మధ్యలో ఒక జనరల్ బాడీ సమావేశం సభ్యుల డిమాండ్ పై జరిగినది. ఆ మీటింగ్ లో జరిగిన మెజారిటీ సభ్యుల వాదన ప్రకారం ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేసి మే18వ తారీకున ఎలక్షన్ అని బోర్డులో పెట్టడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు లో కేస్ 7వ తారీకున తీర్పు వెలువడనున్నది. కానీ నామినేషన్ వేయుటకు 5వ తారీకు తుది దినంగా ప్రకటించారు మరియు మే10వ తేదీ లోపల అంతిమంగా నిలబడే వారి ప్రకటన. అంటె 6 సంవత్సరలుగా లేని తొందర ఇప్పుడు ఎందుకు వచ్చిందో, ఈ నిర్ణయం తీసుకొన్న కమిటీ తెలియచేయాలి. జనరల్ బాడీ మీటింగ్ లోనే మిగతా సభ్యులు వారి చర్యలను ఖండించి ఉండాలి, సుప్రీంకోర్టు కంటె ఒక అసోసియేషన్ గొప్పదా? అప్పుడు మీరు సుప్రీంకోర్టుకు రావటం ఎందుకు మీ సమస్యలను కూర్చొని మీరే పరిష్కరించుకోవచ్చు కదా అంతే కాకుండా. భారత అత్యున్నత న్యాయస్థానం సమయం ను వృధా చేయడం కరెక్ట్ కాదు అన్న విషయాన్ని వీరు ఆలోచించాలి. ఈ ఎన్నికలు ఎలాంటి పరిస్థితులలో జరగవు అని చాలామంది సీనియర్ న్యాయవాదులు తెలుపుతున్నారు. భారత ప్రభుత్వం ఏదేని సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులపై ఏలాంటి నిర్ణయాలు తీసుకోదు. ఒక 3 వేల మంది గల అసోసియేషన్ ఈ విదమైన నిర్ణయం తీసుకోవడం కోర్ట్ ను ధిక్కరించడం కాదా….?

Related posts

ఏపీలో కొత్త రైల్వే లైన్‌.. ఈ రూట్‌లోనే, హైదరాబాద్ నుంచి తిరుపతి త్వరగా వెళ్లొచ్చు.. లైన్ క్లియర్

M HANUMATH PRASAD

CAG report exposes AP’s alarming fiscal crisis: Buggana*

M HANUMATH PRASAD

చంద్రబాబు, రేవంత్‌ ఇద్దరూ దోషులే.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు రద్దు చేయాలి: సీజేఐకి మత్తయ్య లేఖ

M HANUMATH PRASAD

పని చేస్తే నే ఇంకొక సారి అవకాశం లేదంటే ఇంటికే -క్యాడర్ కి క్లాస్ పీకిన చంద్రబాబు

M HANUMATH PRASAD

శత్రువు బలహీనంగా ఉన్నా ఎందుకు వదిలేసినట్టు.. విరమణ ఒప్పందంపై ప్రశ్నలెన్నో!

M HANUMATH PRASAD

ఆంధ్రాలో భారీగా తగ్గనున్న బంగారు ధరలు..గోల్డ్ మైన్‌లో బంగారం చీప్‌గా కొనేయోచ్చు?

M HANUMATH PRASAD