మనిషిలో మృగాడు బయటపడ్డాడు. కట్టుకున్న భార్య అక్కని ట్రాప్ చేసి ఆమె పొందుకోసం భార్యని కానరాని తీరాలకు దరి చేర్చాడు. వివరాల్లోకెళ్తే అనిల్ కుమార్ అనే వ్యక్తి టీజీపీ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు అతనికి సాహితీ అనే భార్య ఉంది వారిద్దరూ కలిసి హైదరాబాదులోని చింతల్ లో కాపురం ఉంటున్నారు కొంతకాలం హ్యాపీగానే జీవించారు. అనిల్ కుమార్ భార్య సాహితి అక్క స్వాతి తన భర్తతో విడిపోయి ఒంటరిగా ఉండడం వల్ల అనిల్ కుమార్ కి భార్య అక్క మీద కన్ను పడింది. దీంతో స్వాతిని ఏ విధంగానైనా తన వశం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన భార్య అక్క అయినా స్వాతి అని కలిసి నేను మీ చెల్లి తో కాపురం చేయాలంటే నువ్వు నాతో పడుకోవాలి అంటూ ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ అనిల్ కుమార్ స్వాతిని చేశాడు. ఆ విధంగా గత మూడు సంవత్సరాలుగా స్వాతిని అనిల్ కుమార్ అనుభవిస్తూనే ఉన్నాడు. ఈ విషయం భార్యకు తెలిసి తరచూ సాహితీ అనిల్ కుమార్ మధ్య తగాదాలు జరుగుతూ ఉండేవి. భార్య అక్కేటువంటి స్వాతి కూడా తనను వదిలేయాలంటూ అనిల్ కుమార్ ని చాలాసార్లు వేడుకుంది అయినప్పటికీ స్వాతి తో శరీర సుఖాల కోసం అనిల్ కుమార్ బరితెగించాడు. సాహితీ తరచూ గొడవలకి దిగుతూ ఉండడంతో భార్య అయినటువంటి స్వాతి తనకు ఎక్కడ దూరం అవుతుందో అని భావించి చివరికి భార్య అయినటువంటి సాహితీని కడ తీర్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే సాహితీ హైదరాబాద్ తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ విషయాన్ని ఆదివారం ఉదయం సాహితీ కుటుంబ సభ్యులకు అనిల్ ఫోన్ చేసి తన భార్య గుండెపోటుతో మరణించింది అంటూ తెలియజేశాడు. సాహితీ మృతదేహాన్ని ఖమ్మం కి కుటుంబ సభ్యులు తీసుకువచ్చి అంత్యక్రియలకు సిద్ధపడుతుండగా సాహితి మృతదేహంపై గాయాలు ఉండడంతో మృతురాలి తల్లిదండ్రులకి అనుమానంతో ఖమ్మం టూ టౌన్ పోలీసులకి సమాచారం అందించారు తమ అల్లుడైనటువంటి అనిల్ కుమార్ తమ కుమార్తెను కొట్టి చంపాడు అని సాహితి తల్లిదండ్రులు తీవ్ర ఆరోపణలు చేశారు దీంతో రంగంలో దిగిన పోలీసులు అనిల్ కుమార్ ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు అనంతరం సాహితీ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ విషయమై అనిల్ కుమార్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
