పెహల్గంపై దాడికి నిరసనగా భారతదేశం పాకిస్తాన్ మీద ప్రతి దాడి చేస్తే దేశంలోని ఏడు ఈశాన్య రాష్ట్రాలను చైనా సహాయంతో స్వాధీన పరుచుకుంటామని బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు యూనస్ ప్రధాన సలహాదారు ఫజ్రల్రె రెహమాన్ భారత ప్రభుత్వానికి తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా హెచ్చరికలు జారీ చేశాడు. ఈ విషయమై సైనిక సంయుక్త ఏర్పాట్లకు చైనా తోటి చర్చించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన తెలియజేశారు. వజ్రాల్ రెహమాన్ తాత్కాలిక అధ్యక్షుడు యోనస్కు అత్యంత సన్నిహిత మిత్రుడు కావడం గమనార్హం. అయితే ఈ విషయమై బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ స్పందిస్తూ రెహమాన్ వ్యాఖ్యలతో తమ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని, అటువంటి వాటిని తాము ప్రోత్సహించమని, బలపరచమని ఇవి అతని వ్యక్తిగత వ్యాఖ్యల కింద పరిగణిస్తామని, కాదు ఎప్పుడూ పురుగు దేశాలతో సత్సంబంధాలను మాత్రమే కోరుకుంటామని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
previous post
